Cucumber Juice: వేసవిలో దోసకాయ రసం తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Apr 04 , 2025 | 07:17 AM
వేసవిలో దోసకాయ రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో దోసకాయ బాగా పని చేస్తుంది. ఇంకా అనేక అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దోసకాయను ముక్కలకు చిన్న అల్లం ముక్క జతచేయాలి. అందులో 5 పుదీనా ఆకులు, 1 టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు, గ్లాసు నీరు తీసుకోవాలి.

ముందుగా దోసకాయను ముక్కలు, అల్లాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మిక్సర్‌లో వాటితో పాటూ అల్లం, పుదీనా ఆకులు నీరు కలిపి గ్రౌండ్ చేయాలి.

తర్వాత దాన్ని జల్లెడ పట్టుకుని, అందులో నిమ్మరసం, నల్ల ఉప్పు కలపాలి. మధ్యాహ్న సమయంలో దీన్ని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.

దోసకాయలో 95% వరకూ నీరు ఉంటుంది. ఇది రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అలాగే శరీరంలోని వేడి తగ్గించడంలోనూ సాయం చేస్తుంది.

దోసకాయ రసం తాగడం వల్ల శరీంలోని విషం బయటికి వెళ్తుంది. చర్మాన్ని శుభ్రంగా చేయడంతో పాటూ ప్రకాశవంతంగా మార్చేందుకు సహకరిస్తుంది.

దోసకాయలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
Updated at - Apr 04 , 2025 | 07:17 AM