Honeypot Ants : ఈ చీమలు తేనె తయారుచేస్తాయి.. వండర్ కదా..
ABN, Publish Date - Mar 20 , 2025 | 08:17 PM
Honeypot Ants : తేనెటీగలు కమ్మని, తియ్యని తేనె తయారుచేస్తాయని తెలుసు. అందుకోసం జీవితమంతా వెచ్చిస్తాయి. ఈ ప్రపంచంలో ఎప్పటికీ చెడిపోని ఆహారపదార్థం తేనెటీగలు ఒక్కటే తయారుచేస్తాయి. కానీ, చీమలు తేనె తయారుచేస్తాయని ఎప్పుడైనా విన్నారా..

తేనెటీగలు తేనె తయారు చేస్తాయని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. కానీ, చీమలకు తేనె తయారుచేసే సామర్థ్యం ఉందని చెప్తేనే ఆశ్చర్యపోతారు. నిజంగా ఇది నిజమండీ బాబూ..

తేనెటీగలు మాత్రమే కాదు, ఒక జాతి చీమలు కూడా తేనెను తయారు చేస్తాయి. కాకపోతే ఈ విషయం గురించి చాలామందికి తెలీదు

తేనెను తయారు చేసే చీమలను హనీపాట్ యాంట్స్ అంటారు. వీటి శాస్త్రీయ నామం కాంపోనోటస్ ఇన్‌ఫ్లాటస్. ఈ చీమలు తేనెటీగల మాదిరిగానే కాలనీలు నిర్మించుకుని నివసిస్తాయి.

తేనెటీగల మాదిరిగానే హనీపాట్ యాంట్స్ కూడా పువ్వుల నుండి పుప్పొడిని సేకరించి వాటి కడుపున దిగువ భాగంలో నిల్వ చేసుకుంటాయి. కడుపు పూర్తిగా తేనెతో నిండినప్పుడు అవి తమ కాలనీ పైకప్పుపై వేలాడుతాయి.

ఈ హనీ యాంట్స్చీ ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో వంటి పొడి ప్రదేశాలలో కనిపిస్తాయి. ఈ చీమలపై ట్రయల్స్ ఆఫ్ లైఫ్ అనే డాక్యుమెంటరీ కూడా రూపొందించారు.
Updated at - Mar 20 , 2025 | 08:33 PM