Fig: అంజీర్ పండు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయంటే..
ABN, Publish Date - Apr 06 , 2025 | 07:17 AM
అంజీర్ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆహారంలో ఈ పండ్లను సరైన పరిమాణంలో చేర్చడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అంజీర్ పండ్లలోని పోషకాలు గుండె ఆరెగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ ఈ పండ్లను తీసుకోవడం వల్ల గుండె సంబధింత వ్యాధులన్నీ దూరంగా ఉంటాయి.

ఈ పండ్లలోని కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అంజీర్ పండ్లలో తక్కువ కేలరీలు ఉండడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఈ పండ్లలోని పోషకాలు జీవక్రియను పెంపొందిస్తాయి.
అంజీర్ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Apr 06 , 2025 | 07:17 AM