Viral News: అంతరిక్షంలో మహిళల సందడి..అవుటాఫ్ 10 బై 10 ఎక్స్‌పీరియన్స్ అంటూ వెల్లడి
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:48 PM
వావ్.. ఒక్క మాటతోనే కేటీ పెర్రీ తన అనుభవాన్ని చెప్పేశారు. జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ నిర్వహించిన న్యూషెపర్డ్ రాకెట్ ప్రయాణంలో, తొలిసారిగా పూర్తిగా మహిళలతో కూడిన ప్రత్యేక అంతరిక్ష యాత్ర జరుగగా, అందులో కేటీ పెర్రీ కూడా సాహసయాత్రికులలో ఒకరిగా పాల్గొన్నారు. ఈ సంద్భర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు.

ఇది నిజంగా ఓ వావ్ మూమెంట్ అని అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ(Katy Perry) అన్నారు. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ న్యూషెపర్డ్ రాకెట్‌లో ఆరుగురు మహిళలు అంతరిక్షానికి వెళ్లి, తిరిగి వచ్చిన ప్రత్యేక సందర్భంగా ఈ మేరకు తెలిపారు. పూర్తిగా మహిళలతో కూడిన తొలి అంతరిక్ష యాత్రలో పెర్రీ కూడా పాల్గొన్నారు. ఇది అవుటాఫ్ 10కి 10 ఇవ్వాల్సిన అనుభవమన్నారు. ఖచ్చితంగా మీరు ఇది మిస్ అవకూడదని పెర్రీ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతరిక్షంలో ఎలాంటి గురుత్వాకర్షణ లేకుండా తేలుతూ What a wonderful world అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
అరుదైన అవకాశం
100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళిన తర్వాత, భూమిపైకి సురక్షితంగా వచ్చిన ఆమె. మొదట చేసిన పని? నెలను ముద్దాడటం. ఆ క్షణం చూసినవారికి నిజంగా గూస్ బంప్స్ వస్తాయని చెప్పవచ్చు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కర్మన్ రేఖ దాటి అంతరిక్ష సరిహద్దుకు వెళ్లింది. పైకి వెళ్లిన తర్వాత క్యాప్సూల్ ప్రధాన రాకెట్ నుంచి విడిపోయి, సున్నా గురుత్వాకర్షణ అనుభవించేలా మారింది. ఆ తర్వాత పారాచూట్ల సాయంతో వారంతా భూమిపైకి వచ్చి ల్యాండ్ అయ్యారు.
ఇది కేవలం స్పేస్ రైడ్ మాత్రమే కాదని, ఓ ఎమోషనల్ జర్నీ, ఓ ఇన్‌స్పిరేషన్, మహిళల శక్తిని ప్రదర్శించే ఒక అరుదైన అవకాశమని పెర్రీ అన్నారు. పైకి వెళ్లిన తర్వాత శూన్యత, నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి భూమిని చూస్తే, మనమంతా అక్కడి నుంచి వచ్చామా అనే ప్రశ్న ఎదురవుతుంది.
అంతరిక్షానికి వెళ్లిన ఆరుగురు మహిళల్లో కేటీ పెర్రీతో పాటు ప్రయాణించిన వారు ఎవరో తెలుసుకుందాం:
లారెన్ సాంచెజ్ – జెఫ్ బెజోస్ కాబోయే భార్య
గేల్ కింగ్ – ప్రముఖ టీవీ ప్రెజెంటర్, ఓప్రా విన్‌ఫ్రేకు స్నేహితురాలు
కెరియాన్ ఫ్లిన్ – చలనచిత్ర నిర్మాత
డాక్టర్ ఐషా బోవ్ – మాజీ నాసా శాస్త్రవేత్త.
అమండా న్గుయెన్ – లైంగిక హింస వ్యతిరేక ఉద్యమకారిణి, నోబెల్ శాంతి బహుమతి అభ్యర్థి
10 నిమిషాల్లో రైడ్
ఈ మిషన్ పూర్తిగా ఆటోమేటెడ్. టెక్సాస్‌లోని వెస్ట్ టెక్సాస్ నుంచి ఉదయం 8:30కి రాకెట్ ఆకాశంలోకి ఎగిసింది. ప్రయాణ సమయం మొత్తం 10 నిమిషాలు మాత్రమే. కానీ ఆ పదినిమిషాల అనుభవం, జీవితాంతం మరిచిపోలేమని అంటున్నారు ఈ ప్రయాణికులు. ఈ ఆరుగురు మహిళలు కలసి, ఒకేసారి అంతరిక్షంలో అడుగుపెట్టడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. 1963లో రష్యన్ స్ఫుట్నిక్ మిషన్‌లో వాలెంటినా తెరేష్కోవా సోలోగా స్పేస్‌కు వెళ్లిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఇప్పుడు 2025లో ఈ ఆరుగురు మహిళలు కలసి మరో చరిత్ర సృష్టించారు.
ఇవి కూడా చదవండి:
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News