Prathyekam : ఈ చీమ చాలా స్పెషల్ గురూ.. వీటి ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:44 AM
మనం ఇసుక, బంగారం, డ్రగ్స్, అరుదైన జీవులను అక్రమంగా తరలించడం చూసి ఉంటాం. కానీ, చీమలను కూడా అక్రమంగా రవాణా చేస్తారని మీకు తెలుసా? దాని ఒక్కో ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.

మన దేశంలో చీమలు కనిపించడం చాలా సాధారణం. తరచుగా ఇళ్లలో కనిపించే వీటిని మనం తొక్కి మరీ చంపేస్తుంటాం. అయితే, కొన్ని ప్రాంతాల్లో చీమలను రక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయనీ మీకు తెలుసా? ఎందుకంటే వీటిని కూడా కొంత మంది అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఒక్కో చీమను రూ. 18 వేలకు అమ్ముతారు. ఆశ్చర్యంగా ఉంది కదా..కానీ, ఇది నిజం. ఆఫ్రికాలోని కెన్యాలో అధిక డిమాండ్ ఉన్న వందలాది చీమలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు.
ఒక్కో చీమ రూ. 18 వేలు
అక్రమ రవాణాలో భారీ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు కూడా ఉన్నాయి. ఒక్కో చీమ 170 పౌండ్లు ( రూ. 18 వేలు) వరకు ఉంటుందని పలువురు బ్రిటిష్ డీలర్లు చెబుతున్నారు. ఈ అక్రమ రవాణాలో పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైన ప్రసిద్ధ క్షీరదాలు ఉన్నాయి. ఇవి దాదాపు 2 నెలల వరకు జీవించి ఉండేలా ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు గురైన కీటకాల సంఖ్యను అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో 'బయో-దొంగతనం' దేశంలోనే మొదటిసారని అక్కడి అధికారులు తెలిపారు.
ఈ కీటకాలను ఆసియాలోని విదేశీ పెంపుడు జంతువుల మార్కెట్‌లో విక్రయించడమే నిందితుల లక్ష్యమని అధికారులు భావిస్తున్నారు. అరుదైన కీటకాల జాతులకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతోందని కేడబ్ల్యూఎస్ తెలిపింది. వీటిని ప్రత్యేక ఆవాసాలలో పెంచుతారు. ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమ దాని జాతిలోనే అతిపెద్దది. ఇది దాదాపు 20 మిమీ వరకు పెరుగుతుంది. పెంపుడు జీవులను పెంచాలనుకునేవారికి ఇవి ఎక్కువగా ఉంటే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుందని ఒక కీటకాల వ్యాపారి తెలిపారు.
Also Read:
ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తింటే సూపర్ బెనిఫిట్స్..
ఇలా ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు..
ఖాళీ కడుపుతో వ్యాయామం మంచిదేనా..