Video Call with Employees: ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్.. ఇలా జరుగుతుందని బాస్ ఊహించి ఉండడు
ABN , Publish Date - Mar 01 , 2025 | 07:59 AM
వీడియో కాల్‌లో ఉండగా కెమెరా ఆన్ చేయాలంటూ ఉద్యోగిని బలవంతం పెట్టిన బాస్‌కు భారీ షాక్. అసలేం జరిగిందో తెలుసుకున్న నెటిజన్లు ఆ బాస్‌కు తగిన శాస్తే జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: వర్క్ ఫ్రం హోం అమల్లో ఉన్న నేటి రోజుల్లో ఉద్యోగులు, బాస్ వీడియో కాల్స్‌లో మాట్లాడుకోవడం, మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం సాధారణమైపోయింది. ప్రస్తుతం ఈ ట్రెండ్ కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనా సంక్షోభం తొలి నాళ్లల్లో విపరీతంగా ఉండేంది. అయితే, ఇంట్లో ఉన్నా కదా అనే భరోసాతో ఉద్యోగులు సాధారణ దస్తుల్లోనే ఇలాంటి మీటింగ్‌లకు హాజరవుతుంటారు. అలాంటి సందర్భాల్లో కెమెరా ఆన్ చేయకుండా, తమ ముఖాన్ని ఇతర సభ్యులకు చూపించుకుండా మీటింగ్లో పాల్గొంటారు. అయితే, కొందరు బాస్‌లు దీన్ని అంగీకరించరు. కచ్చితంగా అందరూ కెమెరా ఆన్ చేసుకుని మీటింగ్‌లో పాల్గొనాలని పట్టుబడతారు. ఇలాగే మొండితనం పోయిన ఓ బాస్‌కు భారీ షాక్ తగిలింది. రెండు మూడేళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని సదరు ఉద్యోగి తాజాగా షేర్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Boss shocked after video call with employees).
Teacher Rant on Bihar: బీహార్‌లో పోస్టింగ్.. కేంద్రీయ విద్యాలయ టీచర్ తిట్ల దండకం
సదరు ఉద్యోగి అసలేం జరిగిందో వివరంగా రెడిట్‌లో రాసుకొచ్చారు. తన బాస్ పేరు మార్క్ అని, ఆయనకు రూల్స్‌ను తూచా తప్పకుండా పాటించడం ఇష్టమని తెలిపారు. బాస్ పనేలోకంగా బతుకుతారని, ఆఫీసుకు రాకుండా ఉండలేరని వివరించారు. అయితే, అప్పటి పరిస్థితుల కారణంగా తమ టీం సభ్యులు మొత్తం దూరాన ఉన్న వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో ఒక రోజు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా తాను కెమెరా ఆన్ చేయకుండానే సమావేశంలో పాల్గొన్నట్టు తెలిపారు. ఇది నచ్చని బాస్ కెమెరా ఆన్ చేయాల్సిందేనని పట్టుబట్టారని అన్నారు. ఆయనకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వినిపించుకోలేదని అన్నారు. అప్పటికి తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటంతో తోటి సభ్యులకు ఆ పరిస్థితుల్లో అలా కనిపించడం తనకు ఇష్టం లేకపోయిందని అన్నారు.
Top Viral Moments of Kumbhmela: మమాకుంభమేళా.. జనాల్ని ఆశ్చర్య పరిచిన టాప్ 10 ఉదంతాలు ఇవే
అయితే, బాస్ ఎంత చెప్పిన వినకపోవడంతో మరోదారి లేక కెమెరా ఆన్ చేశానని అన్నాడు. అప్పటికే ఆసుపత్రి బెడ్‌పై ఉన్న తనను చూసేసరికి బాస్‌కు నోట మాట రాలేదని, ముఖంలో నెత్తురు చుక్కలేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. తన చేసిన తప్పు బాస్‌కు అర్థమయ్యేసరికి మరో మాట లేకుండా కెమెరా ఆఫ్ చేసేందుకు అనుమతి ఇచ్చాడని చెప్పుకొచ్చారు. చేతికి సెలైన్లు, ముక్కుకు మాస్కులు గట్రా పెట్టుకుని తాను మీటింగ్‌లో పాల్గొంటున్నట్టు ఊహించని లేని బాస్ తను చేసిన తప్పుకు ఖిన్నుడయ్యాడని చెప్పుకొచ్చారు. అతడికి తగిన గుణపాఠం లభించినందుకు తనకూ కాస్తంత సంతోషం కలిగిందని వివరించారు. కాగా, ఈ ఉదంతం జనాలకు కూడా నచ్చడంతో ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.