Bride's Mother Elopes With Groom: కాబోయే అల్లుడితో మహిళ ఎఫైర్.. కూతురి పెళ్లికి ముందు జంప్!
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:39 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాబోయే అల్లుడితో వ్యవహారం నడిపిన ఓ మహిళ పరారైపోయింది. పెళ్లికి సరిగ్గా తొమ్మిది రోజులు ఉందనంగా ఈ ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో కల్లోలం రేగింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సమాజంలో విలువలు నానాటికీ పడిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో వావివరుసలు మరుస్తున్న కొందరు అడ్డూ అదుపు లేకుండా విసృంఖలత్వానికి తెరతీస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. మరి కొద్ది రోజుల్లో కూతురి పెళ్లనగా ఓ మహిళ తనకు కాబోయే అల్లుడితో పారిపోయింది. కన్న కూతురి జీవితాన్నే చేజేతులా నాశనం చేసింది (Bride's Mother Elopes With Groom in UP).
అలీగఢ్‌లోని మద్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, తన కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ ప్రేమలో పడింది. పెళ్లికి ఇంకా తొమ్మిది రోజుల సమయం ఉందనంగా వారిద్దరూ ఇల్లు విడిచి పారిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగూణంగా ఓ పథకం రూపొందించుకున్నారు. ఇటీవలో ఓ రోజు ఆ మహిళ తన కూతురి పెళ్లి కోసం చేయించిన నగలు, డబ్బు తీసుకుని కాబోయే అల్లుడితో జంపైపోయింది.
వధువు తల్లే స్వయంగా కూతురికి ఈ సంబంధం తెచ్చిందని కూడా సమాచారం. ఈ క్రమంలో పెళ్లి ఏర్పాట్ల పేరిట వరుడు తరచూ అత్తవారింటికి వచ్చి వెళుతుండేవాడట. అలా వారు కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా దగ్గరయ్యారు. తనకు కాబోయే అత్తకు వరుడు ఏకంగా ఓ మొబైల్ ఫోన్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ చర్య ఇంట్లో వాళ్లకు అసహజంగా కనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. బహుమతి ఇస్తే తప్పేముందని వాళ్లకు వాళ్లే సర్దిచెప్పుకున్నారు.
ఈ క్రమంలో వధూవరుల కుటుంబాలు ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాయి. బంధువులు, స్నేహితులకు ఆహ్వానపత్రికలు కూడా ఇచ్చారు. మరోవైపు, వరుడు అతడికి కాబోయే అత్త తమ ప్లాన్ అమలు చేశారు. షాపంగ్ పేరిట బయటకు వెళ్లిన ఇద్దరూ మళ్లి ఇంటికి రాలేదు. ఇంట్లో ఉండాల్సిన నగలు, డబ్బు కూడా కనిపించకపోవడంతో ఇరు కుటుంబాలు లబోదిబోమన్నారు. తమ అనుమానాలు నిజమైనందుకు కన్నీటిపర్యంతమయ్యారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారి జాడ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కూతురి జీవితం చేజేతులా నాశనం చేసిన మహిళపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు