Share News

Chicken Tikka masala Cake: మీరెప్పుడైనా చికెన్ టిక్కా మసాలా కేక్ తిన్నారా.. అయితే మీ కోసమే..

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:20 PM

సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది బిర్యానీ, చికెట్ టిక్కా, కేక్‍లు వంటివి తెగ తింటుంటారు. అయితే మీరెప్పుడైనా చికెన్ టిక్కా, కేక్ రెండూ కలిపి తిన్నారా? అదేంటీ.. భోజనం తర్వాత ఎవరైన స్వీట్ తింటారు కదా? రెండూ కలిపి ఎలా తింటారని అనుకుంటున్నారా? అక్కడ ఉంది మరి అసలు విషయం.

Chicken Tikka masala Cake: మీరెప్పుడైనా చికెన్ టిక్కా మసాలా కేక్ తిన్నారా.. అయితే మీ కోసమే..
Chicken Tikka masala Cake

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ వివిధ రకాల వంటకాలను రుచి చూసేందుకు ఇష్టపడుతుంటారు. మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా? అని గూగుల్ చేసి మరీ వివిధ ప్రదేశాలకు వెళ్తుంటారు. అక్కడ దొరికే రకరకాల పదార్థాలను లాగించేస్తుంటారు. అయితే తాజాగా జోష్ ఎల్కిన్ అనే చెఫ్ చేసిన ఓ వింత వంటకం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వంటకం ఏంటి? దాన్ని ఎలా తయారు చేశాడు? అది ఎందుకు వైరల్‍గా మారిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది బిర్యానీ, చికెట్ టిక్కా, కేక్‍లు వంటివి తెగ తింటుంటారు. అయితే మీరెప్పుడైనా చికెన్ టిక్కా, కేక్ రెండూ కలిపి తిన్నారా? అదేంటీ.. భోజనం తర్వాత ఎవరైన స్వీట్ తింటారు కదా? రెండూ కలిపి ఎలా తింటారని అనుకుంటున్నారా? అక్కడ ఉంది మరి అసలు విషయం. ఇలా ట్రై చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


చెఫ్ జోష్ ఎల్కిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా "ది జోష్ ఎల్కిన్"లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దాంట్లో చికెన్ టిక్కా, కేక్‌తో అతనో కొత్తరకం వంటకం చేసి చూపించాడు. వీడియో ప్రకారం.. ముందుగా ఓ గిన్నెలో పుదీనా చెట్ని, పెరుగు రెండూ బాగా కలిపి దాన్ని పక్కన పెట్టుకున్నాడు. అనంతరం ఆ మిశ్రమంలో కొంచెం ఓ రేకు వంటి ప్లేట్‍పై పూశాడు. ఆ తర్వాత దానిపై చపాతి సైజులో ఉన్న బ్రెడ్ ముక్కను పెట్టాడు. దానిపై మళ్లీ ఆ మిశ్రమాన్ని పూశాడు. మరోసారి బ్రెడ్ ముక్క పెట్టి దానిపై బిర్యానీ వేసి పరిచాడు. దానిపై మళ్లీ బ్రెడ్ పెట్టి రైతా పూశాడు. అలా బ్రెడ్ ముక్కల మధ్య వివిధ పదార్థాలు పెడుతూ ఎత్తుగా కేక్‍ల తయారు చేశాడు. అనంతరం దాని చుట్టూ మెుదట కలిపిన పుదీనా చెట్ని, పెరుగు మిశ్రమాన్ని అంతటా రాశాడు.


చివరిగా దానిపైన చికెన్ టిక్కా ముక్కలు పెట్టి మధ్యలో ఉల్లిపాయల మిశ్రమాన్ని ఉంచాడు. అది చూసేందుకు అచ్చం కేకుల మారిపోయింది. అనంతరం దాన్ని ఓ పదునైన కత్తితో కట్ చేయగా.. కేకుల మెత్తగా తెగిపోయింది. అందులోని ఓ ముక్కను తీసుకుని తింటూ ఇదే నా చికెన్ టిక్కా మసాలా కేక్ అంటూ సదరు చెఫ్ వీడియోను పోస్టు చేశాడు. వీడియో చూసిన నెటిజన్లు అంతా అతని వంటకం చూసి ఫిదా అయిపోతున్నారు. ఇది కచ్చితంగా తమ ఇంట్లో తయారు చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. స్వీట్, హాట్ మిక్సైన వంటకాన్ని తామెప్పుడూ చూడలేదని కొందరూ.. చికెన్ టిక్కా కేక్ చూసేందుకు చాలా అద్భుతంగా ఉందని మరికొందరూ.. చూడటానికి బావుంది కానీ, తింటే ఎలా ఉంటుందో అని మరికొందరూ ఫన్నీఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Buffalo Attack On Lion: దున్నపోతులకు కోపం వస్తే ఇంతే.. దాడి చేసిన సింహం పరిస్థితి చివరకు..

CM Revanth Reddy: బీఆర్ఎస్, కేసీఆర్‍పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి..

Updated Date - Mar 13 , 2025 | 04:24 PM