Viral: వలసపాలనపై పశ్చాత్తాపం.. భారతీయులకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్ పాప్ సింగర్
ABN , Publish Date - Jan 19 , 2025 | 08:29 PM
వలసపాలనలో భారతీయులపై జరిగిన అకృత్యాలకు బ్రిటన్ పాప్ సింగర్ క్రిస్ మార్టిన్ క్షమాపణలు తెలిపారు. తాము బ్రిటిషర్లమైనా తమకు ఘన స్వాగతం పలికినందుకు భారతీయ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ను దాదాపు రెండు వందల ఏళ్ల పాటు ఏలిన బ్రిటన్ వలస పాలకులు 1947లో దేశాన్ని వీడారు. బ్రిటన్ పాలన సందర్భంగా భారతీయులు ఎన్నో అగచాట్ల పాలయ్యారు. అయితే, బ్రిటన్ పాలనలో నరకం అనుభవించిన భారతీయులకు తాజాగా బ్రిటన్ పాప్ సింగర్ క్రిస్ మార్టిన్ క్షమాపణలు చెప్పారు. బ్రిటన్ పాలనలో నరకం అనుభవించినా తమను క్షమించినందుకు ధన్యవాదాలు తెలిపారు (Viral).
Viral: వామ్మో.. ఈ కోతి గాలిపటం ఎగరేయడం ఎక్కడ నేర్చుకుందో.. షాకింగ్ వీడియో
శనివారం ముంబైలో బ్రిటన్ పాప్ బాండ్ కోల్డ్‌ప్లే మ్యూజిక్ కాన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బ్యాండ్ సభ్యులకు భారత్‌లో అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. భారతీయుల అభిమానం చూసి సంబరపడ్డ లీడ్ సింగ్ క్రిస్ మార్టిన్ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు.
‘‘బ్రిటిషర్లమైనప్పటికీ మాకు ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. మేం చేసిన పనులను మరిచి క్షమించినందుకు ధన్యవాదాలు’’ అని క్రిస్ మార్టిన్ అన్నారు. దీంతో, కాన్సర్ట్‌లో అభిమానుల కరతాళ ధ్వనులు ఆకాశాన్నంటాయి. కాగా, భారతీయులను హిందీలో పలకరించిన క్రిస్ మార్టిన్ వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. షుక్రియా అంటూ అభిమానులకు క్రిస్ థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా క్రిస్ అభిమానుల చేతిలోని ప్లకార్డులు చదువుతూ.. జై శ్రీరామ్ అనడం కూడా జనాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న కోల్డ్ ప్లే జవనరి 21,22 తారీఖుల్లో అహ్మదాబాద్‌లో మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొంటారు.
Viral: బిడ్డను కన్నందుకు పరిహారంగా భార్యకు ‘మహిళా పన్ను’ చెల్లింపు! ఇదేం తీరు దేవుడా..
కాగా, 1947లో భారత్‌ను వీడిన బ్రిటన్ పాలకులు భారతీయులను అగచాట్ల పాలు చేసినందుకు ఎన్నడూ అధికారికంగా క్షమాపణ చెప్పలేదు. అయితే, జలియన్ వాలా బాగ్ ఉదంతం వంటి సంఘటనలపై మాత్రం అక్కడి వారు విచారం వ్యక్తం చేశారు. వలస పాలనలో కొన్ని జరిగిన కొన్ని ఘటనలు వేదనాభరితమని బ్రిటన్ రాజు ఛార్ల్స్ కూడా ఒకానొక సందర్భంలో అంగీకరించారు. భారత్‌లో బ్రిటన్ పాలన 1745లో మొదలై 1947 వరకూ గడిచిన విషయం తెలిసిందే.