Share News

Metro Passenger Drinking Appy Fizz: యువకుడు మెట్రోలో మద్యం తాగుతున్నట్టు వైరల్ వీడియో.. నెట్టింట రేగిన కలకలంతో..

ABN , Publish Date - Apr 07 , 2025 | 09:10 PM

మెట్రోలో యువకుడు మద్యం తాగుతున్నట్టు వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై సదరు యువకుడు స్వయంగా వివరణ ఇచ్చి మరిన్ని విమర్శల పాలయ్యారు.

Metro Passenger Drinking Appy Fizz: యువకుడు మెట్రోలో మద్యం తాగుతున్నట్టు వైరల్ వీడియో.. నెట్టింట రేగిన కలకలంతో..
Metro Passenger Drinking Appy Fizz

ఇంటర్నె్ట్ డెస్క్: మెట్రోల్లో మద్యపానం, ధూమపానంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే, మెట్రో రైల్లో దర్జాగా సీటులో కూర్చుని ఓ యువకుడు మద్యం తాగుతున్నట్టు ఉన్న వీడియో నెట్టింట పెను కలకలాన్నే సృష్టించింది. అసలు ఏం జరుగుతోందో అర్థంకాక జనాలు గగ్గోలు పెట్టారు. ఇలాంటి దారుణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. నెట్టింట ఇలా గగ్గోలు రేగడంతో సదరు యువకుడు చివరకు క్లారిటీ ఇచ్చాడు.

ఢిల్లీ మెట్రోలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువకుడు గాజు గ్లాసులో మద్యం రంగులో ఉన్న పానీయం ఏదో తాగాడు. ఆ తరువాత ఉడకబెట్టిన గుడ్డు పెచ్చు ఒలిచి తిన్నాడు. మెట్రో తన సొంతమైనట్టు ఎవరినీ లెక్కచేయకుండా ఎంజాయ్ చేశాడు. కొందరు అతడి తీరును వీడియోలో రికార్డు చేశారు. కానీ అతడిని సమీపించి ప్రశ్నించే సాహసం మాత్రం చేయలేదు. దీంతో, మనోడు, అందరినీ పరిశీలిస్తూ తన పని తాను చేసుకుపోయాడు. ప్రపంచంతో తనకు ఏం సంబంధం లేనట్టు ప్రవర్తించాడు. కోడిగుడ్డు పెచ్చులను కింద పడేశాడు.


ఇక ఈ వీడియో నెట్టింట కాలు పెట్టడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ముద్దులు, గొడవలకు వేదికగా మారిన ఢిల్లీ మెట్రో చివరకు ఇలాంటి అరాచకాలకూ నెలవైపోయిందా అని కొందరు ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలా నడుచుకోవాలో తెలీక పోతే ఎలా అని కొందరు అన్నారు. కొందరు మాత్రం సెటైర్లు పేల్చారు. కంపెనీలో నోటీస్ పీరియడ్‌లో ఉండి ఉంటాడు. అందుకే ఇలా చేస్తున్నాడని అన్నారు. ఇంకొందరు ఢిల్లీ మెట్రో అధికారులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.


ఈ ఉదంతం ఇలా తెగ వైరల్ కావడంతో సదరు వ్యక్తి స్వయంగా స్పందించాడు. తాను తాగుతున్నది యాపీ ఫిజ్ అని మద్యం కాదని స్పష్టం చేశాడు. దీంతో, మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి ప్రాంక్ వీడియో కోసం జనాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి వాళ్ల వీడియోలపై స్పందింస్తే మరింతగా ప్రోత్సహించినట్టు అవుతుందని అన్నారు. పట్టించుకోకుండా ఉంటే వాళ్లకే బుద్ధి వస్తుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది. మరి మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి:

మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

Read Latest and Viral News

Updated Date - Apr 07 , 2025 | 10:23 PM