Intelligent Dog Breeds: ప్రపంచంలో అత్యంత తెలివైన టాప్ 5 డాగ్ బ్రీడ్స్ ఏవో తెలుసా..
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:36 PM
Most Intelligent Dog Breeds: శునకాలు చాలామంది మనుషులకు ప్రాణస్నేహితుల కంటే ఎక్కువ. వీటి తెలివితేటలు, ప్రేమ, నమ్మకం, అల్లరి ఎంతోమందికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వీటితో సహవాసం మానసిక ఒత్తిడిని దూరం చేసే టానిక్ లాంటిదని కొందరి భావన. పోలీస్ దర్యాప్తులు, వేట, కాపలా ఇలా ఎన్నో చోట్ల సాయపడే శునకాల్లో ఎన్నో వందల జాతులున్నాయి. కానీ, ఈ 5 జాతులే ప్రపంచంలో అత్యంత తెలివైనవి.. వీటికి శిక్షణ ఇవ్వడం చాలా సులభం.

Most Intelligent Dog Breeds: నమ్మకానికి, విశ్వాసానికి మారు పేరు శునకాలు. మనుషుల మొట్టమొదటి పెంపుడు జంతువు ఇదే. ఒకసారి స్నేహం చేస్తే ఆఖరి క్షణం వరకూ యజమనిని ప్రేమిస్తూనే ఉంటాయి. ఆపద సమయాల్లో ప్రాణాలకు తెగించి పోరాడటానికి కూడా వెనుకాడవు. అందుకే డాగ్స్ అంటే చాలామందికి ఇష్టం. పోలీసు ఇన్వెస్టిగేషన్లలో కూడా శునకాలు పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలుసు. ఎంత పెద్ద జంతువునైనా ఎదిరించి ధైర్యంగా పోరాడగలిగే తత్వం, వినికిడి శక్తి, వాసన పసిగట్టే శక్తి వీటికి అమోఘంగా ఉంటుంది. భూకంపాలు, ఇతర ఏ ప్రకృతి విపత్తులను అయినా ముందే కనిపెట్టగలవు. కానీ, ప్రపంచంలో ఈ 5 శునకాలు మరింత ప్రత్యేకం. వీటిని ట్రైన్ చేయడం చాలా సులభం.
పూడల్
ఈ కుక్కలు అందమైనవి మాత్రమే కాదు. తెలివితేటల్లోనూ మేటి. బహుముఖ ప్రజ్ఞ ఉన్న శునకాలుగా ప్రసిద్ధి చెందాయి. పూడల్స్‌లో స్టాండర్డ్, మినియేచర్, టాయ్ అనే మూడు రకాలున్నాయి. ఇవన్నీ షార్ప్ మైండ్ ఉన్నవే. కొత్తవి నేర్చుకోవాలనే తపనా, ఆసక్తి వీటికి చాలా ఎక్కువ. ఇవి ఏం చెప్పినా త్వరగా నేర్చుకుంటాయి. అందుకే వేగంగా నేర్చుకోగలిగే సామర్థ్యమున్న డాగ్స్‌గా వీటికి పేరుంది.
బోర్డర్ కోలీ
బోర్డర్ కోలీలు ప్రపంచంలోనే అత్యంత తెలివైన కుక్క జాతులలో ఒకటిగా పరిగణిస్తారు. వీటిని మొదట గొర్రెలను మేపడానికి పెంచేవారు. ఎందుకంటే ఇవి తెలివైనవి. త్వరగా నేర్చుకుంటాయి. ఈ కుక్కలు చురుగ్గా, సంతోషంగా ఉండటానికి ఇష్టపడతాయి. బాగా శిక్షణ పొందిన బోర్డర్ కోలీ విధేయతగా, ఆప్యాయతగల నేస్తంగా ఉంటుంది.
జర్మన్ షెపర్డ్
జర్మన్ షెపర్డ్‌లు ప్రసిద్ధ కాపలా కుక్కలు. తెలివితేటలు, విధేయత, రక్షణ స్వభావానికి మారుపేరు. బాగా శిక్షణ పొందిన జర్మన్ షెపర్డ్స్ సమస్యలను పరిష్కారించగలిగే నైపుణ్యాలను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని పోలీసులు, సైనికులు, నేర పరిశోధన కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇళ్లల్లో పెంచుకుంటే అద్భుతమైన కుటుంబ పెంపుడు జంతువులుగా కూడా మారతాయి.
గోల్డెన్ రిట్రీవర్స్
అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు కుక్క జాతులలో గోల్డెన్ రిట్రీవర్స్ ఒకటి. ఇవి తెలివైనవి మాత్రమే కాదు. అత్యంత ఆప్యాయత కలిగిన, స్నేహపూర్వకమైన కుక్క జాతులలో ఒకటి. పిల్లలు ఉన్న కుటుంబాలు ఈ శునకం పెంపుడు జంతువుగా అనువైనది. మొదట వేటాడటం కోసం వీటిని పెంచేవారు. అధిక తెలివితేటలు, దేశాలను పాటించే స్వభావం, యజమానులు తమను ఇష్టపడాలనే కోరిక వీటికి ఎక్కువ. ఇవి చురుగ్గా, సరదాగా ఉంటాయి. శిక్షణ పొందేటప్పుడు చాలా ఓపిగ్గా నేర్చుకుంటాయి.
లాబ్రడార్ రిట్రీవర్
లాబ్రడార్ రిట్రీవర్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కుక్క జాతులలో ఒకటి. తెలివితేటలు, స్నేహపూర్వక స్వభావం, త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉన్న శునకాలుగా ప్రసిద్ధి చెందాయి. మొదట్లో వీటిని మానవులకు వేటలో సహచరులుగా పెంచుకునేవారు. అందుకే సహజంగానే విధేయత కలిగి ఉంటాయి. నేర్చుకోవాలనే ఆసక్తి, తెలివితేటలు అధికం. ఇవి సేవా కార్యక్రమాల్లో, దర్యాప్తు, కాపలాదారులుగా అద్భుతంగా పనిచేస్తాయి.
Read Also: Optical Illusion: ఈ ఫొటోలో బుల్లి పక్షిని చూశారా.. కేవలం జీనియస్‌లే 10 సెకన్లలో కనిపెట్టగలరు..
Mobile Number: మొబైల్ నంబర్‌లో 10 సంఖ్యలు ఎందుకుంటాయి.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Firing Viral Video: గన్ వాడాలంటే వీడి తర్వాతే ఎవరైనా.. ఎలా ఫైర్ చేశాడో చూస్తే షాకవ్వాల్సిందే..