Dog’s Bark Sends Leopard Packing: సర్‌ప్రైజ్ ఎటాక్ అంటే ఇదీ.. కుక్క ధాటికి తట్టుకోలేక చిరుత బేజారు
ABN , Publish Date - Apr 08 , 2025 | 07:04 PM
నక్కినక్కి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ చిరుతకు కుక్క ఊహించని షాకిచ్చింది. ఫన్నీగా ఉన్న ఈ వీడియో చూసి జాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతిలో వింత విశేషాలు ఎన్నో ఉంటాయి. కొన్ని ఘటనలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో జనాలు పడీపడీ నవ్వేలా చేస్తోంది. కుక్క దెబ్బకు చిరుత పారిపోవడం చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదని కూడా కామెంట్ చేస్తు్న్నారు. రణ్‌థమ్‌బోర్ నేషనల్ పార్కులో ఈ దృశ్యం కనిపించింది.
చిరుతకు ఉండే వేటాడే గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చిరుతలలు ఓ మోస్తరు ఆకారం కలిగిన మొసళ్లు సైతం వేటాడగలవు. ఇక శునకాలు పెంపుడు జంతువులు అయినప్పటికీ తోడేళ్ల నుంచి సంక్రమించిన వేటాడే గుణం, పోరాడే తత్వం వీటిల్లో ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ రెండూ తారసపడితే జీవన్మరణ పోరాటం జరుగుతుంది. ఒక్కోసారి మాత్రం పొట్టచెక్కలయ్యే సీన్స్ ఆవిష్కృతమవుతాయి (Dog’s Bark Sends Leopard Packing).
ఇటీవల ఓ చిరుత జాతీయవనం నుంచి మానవ ఆవాసాల మధ్యకు వచ్చింది. ఆ ప్రాంతం కొత్త కావడంతో చడీచప్పుడూ రాకుండా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఓ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసింది. అయితే, ఇంటిముందున్న ఎత్తైన వసారాపై ఓ కుక్క పడుకుని ఉంది. దాన్ని చిరుత గమనించలేదు. చిరుత రాక కూడా శునకం దృష్టికి రాలేదు.
చిరుత కుక్క సమీపానికి రావడంతో అలికిడికి అది లేచి చూసింది. ఎదురుగా చిరుత కనిపించడంతో పెద్దగా మొరిగింది. అక్కడ కుక్క ఉన్న విషయం తెలియకపోవడంతో ఆ శబ్దానికి చిరుత కూడా ఉలిక్కిపడింది. ముందు వెనకా చూసుకోకుండా అక్కడి నుంచి ఒక్క గెంతులో పారిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డై నెట్టింట బాట పట్టి వైరల్‌గా మారాయి.
ఇక కుక్కను చూసి చిరుత బెదిరిపోవడం అనేక మంది కడుపుబ్బా నవ్వించింది. జనాలు రకరకాల కామెంట్స్ చేశారు. సడెన్‌గా మొరిగి చిరుతకు గుండెపోటు తెప్పించినంత పని చేసిన కుక్క నిజంగా హీరోనే అని కొందరు అన్నారు. సర్‌ప్రైజ్ ఎటాక్స్‌తో ఇలాంటి ఫలితాలే ఉంటాయని కొందరు చెప్పుకొచ్చాడు. ఆ కుక్కను చిరుత ముందే పసిగట్టి ఉంటే ఈ పాటికి దాన్ని మట్టుపెట్టి ఉండేదని తెలిపారు. ఇక గతంలోనూ ఇలాంటి వీడియోలు వెలుగు చూశాయి. అయితే, మెజారిటీ ఉదంతాల్లో చిరుత బారిన పడ్డ కుక్కలు ప్రాణాలు విడిచాయి.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు