Share News

Elderly Man Woman's Pics: వృద్ధుడిని ఛీదరించుకుంటున్న జనం.. ఇతడు ఏం చేశాడో తెలిస్తే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 03:17 PM

తన పక్కన ఉన్న యువతి కాళ్లను సీక్రెట్‌గా ఫొటో తీసిన యువతి ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. రెడ్ హ్యాడెండ్‌గా దొరికినా అతడు తనని తాను సమర్థించుకున్న తీరు చూసి వృద్ధుడిపై జనాలు ఫైరైపోతున్నారు.

Elderly Man Woman's Pics: వృద్ధుడిని ఛీదరించుకుంటున్న జనం.. ఇతడు ఏం చేశాడో తెలిస్తే..
Elderly Man Woman's Pics

ఇంటర్నెట్ డెస్క్: కొందరికి ఎంత వయసొచ్చినా బుద్ధి మాత్రం మారదు. పైపెచ్చు.. తమ దుర్భుద్ధినంతా సిగ్గులేకుండా నలుగురిలో బయటపెట్టుకుంటూ ఉంటారు. ఇదేంటని నిలదీస్తే సిగ్గుపడాల్సింది పోయి చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఓ వృద్ధుడి ఉందతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. జనాలకు తిక్క రేగేలా చేస్తోంది. ఇలాంటోళ్ల మధ్య ఉంటున్నామంటే మనం నిజంగా దురదృష్టవంతులమే అంటూ కొందరు నిట్టూరిచ్చారు. రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం దేవవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

సిరోహీ జిల్లాలోని మౌంట్ అబూ హిల్ స్టేషన్‌ వద్ద గల దిల్వారా జీనాలయం పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ తన గర్ల్‌ఫ్రెండ్ కు ఎలాంటి అనుభవం ఎదురైందీ చెబుతూ అనురాగ్ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తనతో అభ్యంతరకంగా ప్రవర్తించిన వృద్ధుడిని ఓ యువతి రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకుంది. తన ఫొటోలను సీక్రెట్‌గా ఎందుకు తీస్తున్నావని కడిగిపారేసింది. తన దుర్బుద్ధి బయట పడినందుకు ఆ వ్యక్తి తొలుత తన తప్పేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. తను ఎటువంటి తప్పు చేయలేదని అన్నాడు. చివరకు ఆమె గట్టిగా నిలదీయడంతో తన ఫోన్‌లోని ఫొటోలు చూపించకతప్పలేదు. అందులో యువతి ఫొటోలు కనబడగానే వృద్ధుడు ప్లేటు ఫిరాయించాడు. నేనేం చేయలేదు.. అయినా ఫొటోలు డిలీట్ చేస్తున్నాను చూసుకో’’ అంటూ వాటిని ఆమె ముందే తొలగించాడు.

‘‘దిల్వారా జీనాలయంలో ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తూ నా గర్ల్‌ఫ్రెండ్ కూర్చొంది. ఆమె తన తల్లిదండ్రుల కోసం వెయట్ చేస్తోంది. ఇంతలో ఓ వృద్ధుడు ఆమె వైపు అసభ్యంగా చూశాడు. ఆ తరువాత సైలెంట్‌‌గా ఆమె కాళ్లను ఫొటో తీశాడు. అతడిని నిలదీయగానే వాటిని డిలీట్ చేశాడు. మరో దారుణం ఏంటంటే.. అక్కడున్న వారెవరూ యువతికి అండగా నిలబడలేదు’’ అని వాపోయారు.


‘‘ఇది అంతా చూస్తుండగా ఓ పబ్లిక్ ప్లేస్‌లో జరిగింది. ఆధ్యాత్మిక ప్రదేశంలో పట్టపగలు జరిగిన దారుణం ఇది. కానీ మహిళలకు గౌరమివ్వాలన్న కనీస స్పృహ అక్కడ కనిపించలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోపై జనాల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత వృద్ధుడై వుండి కూడా మహిళతో ఇంత దారుణంగా ప్రవర్తించాడంటే ఎంత సంస్కారహీనుడో అర్థమవుతోంది’’ అని మరో వ్యక్తి అన్నాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

17 డాక్టర్లకు సాధ్యం కానిది చేసి చూపించిన చాట్ జీపీటీ

యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై

సైబర్ నేరగాళ్లను ఎలా బురిడీ కొట్టించాలో ఈ బాలికను చూసి నేర్చుకోవాలి

Read Latest and Viral News

Updated Date - Apr 15 , 2025 | 03:25 PM