Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:53 AM
కొన్ని జంతువులు వేగానికి ప్రసిద్ధి చెందాయి. మరికొన్ని బలానికి పెట్టింది పేరుగా నిలుస్తాయి. శక్తివంతమైన జంతువు గురించి మాట్లాడేటప్పుడు, అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు ఏనుగు. ఏనుగు చాలా ప్రశాంతమైన జంతువు. అయితే దానికి కోపం వచ్చినప్పుడు మాత్రం అది ఏదైనా చేయగలదు.

ఈ ప్రపంచంలో చాలా జంతువులు (Animals) ఉన్నాయి. ఒక్కో జంతువుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. కొన్ని వేగానికి ప్రసిద్ధి చెందాయి. మరికొన్ని బలానికి పెట్టింది పేరుగా నిలుస్తాయి. శక్తివంతమైన జంతువు గురించి మాట్లాడేటప్పుడు, అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు ఏనుగు (Elephant). ఏనుగు చాలా ప్రశాంతమైన జంతువు. అయితే దానికి కోపం వచ్చినప్పుడు మాత్రం అది ఏదైనా చేయగలదు. అటువంటి పరిస్థితిలో, ఎటువంటి వారైనా ఏనుగుకు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఏనుగు శక్తి గురించి పూర్తిగా అర్థమవుతుంది (Viral Video).
@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బహిరంగ ప్రదేశంలో కొందరు మనుషులు జేసీబీతో పని చేయిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఏనుగు అక్కడకు వచ్చింది. అది వేగంగా పరిగెత్తుకుంటూ జేసీబీ (JCB) దగ్గరకు వచ్చింది. నేరుగా జేసీబీ దగ్గరకు వెళ్లి దానిని ఎత్తి పడేసింది. అంత జేసీబీ కూడా ఏనుగు ముందు నిలవలేకపోయింది. ఆ తర్వాత ఏనుగు అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయింది. జనాలు కేకలు వేస్తూ ఆ ఏనుగు వెనుక పరిగెత్తారు. ఆ ఏనుగును అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేను ఏనుగుతో గొడవ పడను``, ``ఏనుగుకు అందరూ కలిసి పిచ్చి ఎక్కిస్తున్నారు``, ``ప్రశాంతమైన ఏనుగును ఇలా చూడడం చాలా బాధగా అనిపిస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: గూగుల్ మ్యాప్స్‌కే షాకిచ్చాడుగా.. కుంభమేళాలో ఓ వ్యక్తి విచిత్ర ఆలోచన.. నెటిజన్లు ఫిదా..
Kerala Anganwadis: బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలి.. చిన్నారి కోరిక.. కేరళ అంగన్వాడీ మెనూపై రివ్యూ..
Viral Business idea: బిజినెస్ ఐడియా అంటే ఇలా ఉండాలి.. కొన్ని రోజుల్లో అంబానీని దాటేస్తాడేమో..
Optical Illusion: ఈ అడవిలో పాము ఎక్కడుంది.. మీ దృష్టి షార్ప్ అయితేనే 6 సెకెన్లలో కనిపెట్టగలరు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి