Viral: సంరక్షకుడికి ఏనుగు తుది వీడ్కోలు.. హృదయాన్ని కదిలించే వీడియో

ABN, Publish Date - Feb 09 , 2025 | 06:54 PM

జీవిత చరమాంకానికి చేరుకున్న తన సంరక్షకుడికి తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన ఓ ఏనుగు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ వీడియోకు భారీగా వ్యూ్స్ వచ్చిపడుతున్నాయి.

Viral: సంరక్షకుడికి ఏనుగు తుది వీడ్కోలు.. హృదయాన్ని కదిలించే వీడియో

ఇంటర్నెట్ డెస్క్: పులులు, సింహాలు, ఎలుగు, ఏనుగు వంటి అడవి జంతువులతో జాగ్రత్తగా ఉండాలనే విషయం పిల్లకు చిన్నప్పటి నుంచే నూరిపోస్తాము. అయితే, అడవి జంతువులకూ మనసు ఉంటుందని, మనుషులతో అవి గాఢమైన బంధాన్ని పెనవేసుకుంటాయనే విషయం ఎప్పుడో రుజువైంది. ఊహకు అందని విధంగా అవి మనుషుల మనసులకు దగ్గరవుతాయి. ఇందుకు సంబంధించి తాజా ఉదంతం జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో ఓ ఏనుగు తన సంరక్షకుడికి తుది వీడ్కోలు పలికి తీరు చూసి జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు (Viral).


Viral: భారత పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకుడిని మోసం చేసే ప్రయత్నం! చివరకు..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఏనుగులను సంరక్షించే ఓ వ్యక్తి జీవిత చరమాంకానికి చేరుకున్నాడు. మరణం అంచున నిలబడ్డాడు. ఇంతకాలం అతడి సంరక్షణలో పెరిగిన ఓ ఏనుగు అతడికి తుది వీడ్కోలు పలికేందుకు వచ్చింది. అతడు ఆసుపత్రి బెడ్‌పై కదలలేని స్థితిలో పడుకుని ఉండగా ఆ ఏనుగు మెల్లగా పాకుతూ బెడ్ వద్దకు వచ్చింది. తన తొండంతో పెద్దాయనను మెల్లగా తాకింది. తాను వెంటనే ఉన్నానని భరో కల్పిస్తున్నట్టు, ఇంతకాలం తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు చెబుతున్నట్టు సున్నితంగా ఆయన చేయిపై తాకింది. అక్కడే ఉన్న మరో మహిళ.. పెద్దాయన చేయిని పైకెత్తి ఏనుగు తొండంపై పెట్టింది. దీంతో, పెద్దాయన కూడా ఏనుగును తాకుతూ గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారి హృదయాలను ఈ దృశ్యం తాకడంతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి.


Viral: విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

ఇక ఈ ఎమోషనల్ వీడియో జనాలను కూడా అమితంగా కదిలించింది. దీంతో, వీడియోకు 60 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘‘అసలైన బంధం అంటే ఇదీ’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ దృశ్యం చూస్తే ఎంతటి కఠిన హృదయుల కళ్లైనా చెమ్మగిల్లాల్సిందే అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ఏనుగులకు భావోద్వేగ పూరిత జంతువులని కొందరు తెలిపారు. అవి కూడా మనుషుల్లాగే సుఖదుఃఖాలను అనుభూతి చెందగలవని చెప్పారు. తోటి జీవాలు పోతే కన్నీరు కార్చడం, తమ నేస్తాలను గుర్తుపెట్టుకోవడం, ప్రేమ కురిపించడం వంటివి చేస్తాయని అన్నారు. తన సంరక్షకుడి పరిస్థితి అర్థం చేసుకుని తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన గజరాజుది గొప్ప హృదయం అని అన్నారు. ఇలా రకరాకల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Feb 09 , 2025 | 06:54 PM