Optical Illusion: ఈ ఫొటోలో బుల్లి పక్షిని చూశారా.. కేవలం జీనియస్‌లే 10 సెకన్లలో కనిపెట్టగలరు..
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:08 PM
Optical Illusion IQ Test: ఆప్టికల్ ఇల్యూజన్స్ ద్వారా ఎవరి ఐక్యూ ఎంత ఉంది అన్నది ఇట్టే తెలుసుకోవచ్చు. వీటిని తరచూ సాల్వ్ చేస్తూ ఉంటే మెమొరీ పవర్ పెరుగుతుంది. మీరే గనక జీనియస్ అయితే ఈ కింది ఫొటోలో పక్షి ఎక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టేయండి చూద్దాం..

Hidden Bird Optical Illusion: తరచూ పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ సాల్వ్ చేస్తుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తూనే మెదడుకు పరీక్ష పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్స్ మన కళ్లని మాయచేస్తాయి. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నా అనుకున్న లక్ష్యాన్ని మీరు కనిపెట్టగలిగితే మీరు నిజజీవితంలోనూ సక్సెస్ కాగలుగుతారు. ఎందుకంటే ఇలాంటివి తరచూ సాల్వ్ చేయడం వల్ల మీ ఆలోచనా ధోరణి మారుతుంది. ఎలాగైనా సాధించాలనే పట్టుదల, ఎక్కువ కోణాల్లో ఆలోచించగలిగే సామర్థ్యం, మెమొరీ పవర్ పెరుగుతాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షించి, రంజింపజేస్తాయి.
మీ మెదడుకు పజిల్స్ పూర్తిచేసే సామర్థ్యముందా.. కనిపించని వాటిని గుర్తించడంలో మీరు నిష్ణాతులని భావిస్తున్నారా. అయితే, ఈ పరీక్ష ద్వారా మీ సత్తా ఏంటో తెలుసుకోండి. మంచంపై గాఢంగా నిద్రపోతున్న అమ్మాయి పొడవాటి జుట్టు దిండుపై పరచుకుని ఉంది. ఆమె పైన పెంపుడు కుక్కపిల్ల, రెండు పిల్లులు పడుకుని హాయిగా నిద్రపోతుంటే.. నేలపై నుంచున్న బ్రౌన్ కలర్ పిల్లి మ్యావ్ అని గట్టిగా అరుస్తూ ఉంది. మంచం చివర ఆకుపచ్చటి చిన్న పూల మొక్క, అమ్మాయి తల పక్కనే ఉన్న బెడ్ ల్యాంప్ పక్కన ఫోన్, పుస్తకం ఉన్నాయి. ఎవరికైనా చూడగానే ఇవే కనిపిస్తాయి. కానీ, తెలివైన వాళ్లే వీటితో పాటుగా ఫొటోలో దాగి ఉన్న తేనెటీగని కనిపెట్టగలరు. సూక్ష్మ పరిశీలనా శక్తి ఉన్నవాళ్లే ఫొటోలో నిగూఢంగా దాక్కున్న బుల్లి పిట్టను గుర్తించగలరు.
చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. మోసపోకండి. మొదటి చూపులోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు. ఫొటోలో ఉన్న పక్షిని కేవలం 10 సెకన్లలో గుర్తించవచ్చు. మీకు ఐక్యూ ఎక్కువగా ఉండి చురుకైన పరిశీలనా సామర్థ్యం ఉంటే మొదటిచూపులోనే పిట్ట ఎక్కడుందో పట్టేస్తారని నిపుణులు చెబుతున్నారు. మరి మీరు రెడీగా ఉన్నారా? మీ టైమర్‌ను సెట్ చేసి ఛాలెంజ్‌కు సిద్ధం కండి. మీ కళ్లు, మెదడు పవర్ ఎంతుందో పరీక్షించుకోండి.
సమయం అయిపోయింది. ఇంతకీ మీరు పక్షిని చూశారా.. మొదటిచూపులోనే బుల్లి పిట్టను కనుక్కోగలిగారంటే మీకు అద్భుతమైన పరిశీలనా నైపుణ్యం ఉన్నట్టే లెక్క. ఒకవేళ మీరు కనిపెట్టలేకపోతే బాధపడకండి. మరోసారి ఈ ఫొటోను బాగా పరిశీలించండి. నిద్రిస్తున్నఅమ్మాయి జుట్టు దిండుపై పరచుకుని ఉంది. ఆ జుట్టుపైనా ఓ బుల్లి అందమైన పక్షి కనిపించిందా. ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ మీకు నచ్చిందా. మీ బ్రెయిన్ షార్ప్ కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉండండి. కింద అలాంటివే కొన్ని లింకులున్నాయి ప్రయత్నించండి మరి.
Read Also: Optical Illusion: ఈ ఫిషర్‌మ్యాన్‌కు సహాయం చేయండి.. చేపలు పట్టే గేలం ...
Lovers Funny Video: మేడపై ప్రియుడిని కలుసుకున్న యువతి.. కంటపడగానే ఏం చేసిందో చూస్తే.. ఖంగుతింటారు..