Viral: విమానంలో వైఫై సర్వీసు వెనక సాంకేతికత ఏంటో తెలుసా?
ABN , Publish Date - Jan 11 , 2025 | 09:09 PM
రెండు రకాల వ్యవస్థల ద్వారా విమానాల్లో వైఫై సర్వీసును అందజేస్తారు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: నగరాల్లో ఉండే వారికి వైఫై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, విమానాల్లో కూడా ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. మరి గాల్లో 30 నుంచి 40 వేల అడుగుల ఎత్తున ఎగిరే విమానంలో ఈ సర్వీసు ఎలా పని చేస్తుందనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అయితే, ఈ కథనం మీకోసమే (Viral).
సాధారణంగా విమానంలో ప్రయాణించేటప్పుడు ప్యాసింజర్ల ఫోన్లకు మొబైల్ నెట్‌వర్క్‌లేవీ అందుబాటులో ఉండవు. కొన్ని ఎయిర్‌లైన్స్ మినహా మిగతా సంస్థలేవీ వైఫై సర్వీసును అందించవు. ఇక నిపుణులు చెప్పే దాని ప్రకారం, విమానం గాల్లో ఉన్నప్పుడు రెండు రకాల వ్యవస్థల ద్వారా ప్రయాణికులకు వైఫై సర్వీసును అందిస్తారు.
Viral: భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రైలు ఏదో తెలుసా?
అందులో మొదటిది ఎయిర్ టూ గ్రౌండ్ సర్వీసు. ఇది అచ్చం మొబైల్ ఫోన్ల సర్వీసులా పనిచేస్తుంది. విమానంలో ఉన్న యాంటీనా నేలపై ఉన్న టవర్ల నుంచి సిగ్నల్స్ ఇచ్చిపుచ్చుకుంటుంది. తద్వారా ప్రయాణికులకు వైఫై అందుబాటులోకి వస్తుంది. అయితే, విమానాలు పర్వతాలు, లేదా సముద్రాల మీదుగా ప్రయాణించినప్పుడు వైఫై అందుబాటులో ఉండదు.
ఇక కొన్ని ఫ్లైట్లల్లో శాటిలైట్ ఆధారిత వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవస్థలో భాగంగా విమానంలోని యాంటీనా సిగ్నల్స్ నేరుగా ఉపగ్రహాలకు చేరుతాయి. అక్కడి నుంచి నేలపై ఉన్న సెల్‌టవర్లకు చేరుతాయి. అయితే, ఎయిర్‌టు గ్రౌండ్ ఆధారిత వైఫై సర్వీసులు వేగవంతమైనవి. శాటిలైట్ సర్వీసులు మాత్రం కొంత మందకొడిగా ఉంటాయి.
Viral: ఉద్యోగులకు చాకిరీ ఎక్కువగా ఉన్న దేశాలు.. ఇక్కడి వారు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారంటే..
చాలా విమానాలు వైఫైని కొంత అదనపు ఖర్చు వసూలు చేస్తాయి. ఇక విమానాల్లో వైఫై స్పీడు పలు రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. విమానం ఎంత ఎత్తులో ఎగురుతోంది, వాతావరణ పరిస్థితులు, ఎంత మంది ప్రయాణికులు వైఫై సర్వీసును వాడుతున్నారనే అంశాలు వైఫై స్పీడును ప్రభావితం చేస్తాయి.
విదేశీ విమాన సర్వీసుల్లో వైఫై ఇప్పటికే అందుబాటులో ఉంది. డెల్టా, యూనైటెడ్ వంటి ఎయిర్‌లైన్స్‌ల్లో సగటున నెలకు 15 లక్షల మంది ఈ సర్వీసును వినియోగించుకుంటారు. భారత్‌లో కూడా ఈ సర్వీసుకు డిమాండ్ పెరుగుతోంది.