Britisher Impressed by Food Delivery: భారతీయ రైల్లో అద్భుత అనుభవం.. మురిసిపోయిన బ్రిటీషర్
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:38 PM
రైల్లో తానున్న బోగీ వద్దకు ఫుడ్ డెలివరీ కావడం చూసి ఓ బ్రిటీషర్ మురిసిపోయాడు. భారత్‌లో డెలివరీ యాప్స్ అద్భుతమంటూ కితాబునిచ్చాడు. ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సాంకేతికతను భారత అవసరాలను తగినట్టు మలచడంలో కొన్ని స్టార్టప్‌లు విజయం సాధించాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. క్యాబ్ బుకింగ్‌తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు, ఫుడ్స్‌తో పాటు పచారీ సామాన్లను ఇంటికి చేర్చే వరకూ వచ్చింది. ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళుతూ రైల్లో ప్రయాణికుల వద్దకు ఫుడ్ చేర్చే సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫెసిలిటీ ఎలా ఉంటుందో తొలిసారి ప్రత్యక్షంగా ఉంటుందో చూసిన ఓ బ్రిటీషర్ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. భారత్ నుంచి బ్రిటన్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రశ్నిస్తూ అతడు పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రైళ్లల్లోని ప్రయాణికులకు కూడా రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ అవుతున్న తీరుకు బ్రిటీష్ ట్రావెల్ వ్లాగర్ బక్లీ ఫిదా అయిపోయాడు. అతడు రైల్లో ఉండగానే శాండ్‌విచ్, మిల్క్ షేక్ కోసం ఆర్డర్ పెట్టాడు. డెలివరీ ఏజెంట్ ఏకంగా తాను ఉన్న కోచ్ వద్దకు వచ్చి మరీ ఫుడ్ ఇచ్చి వెళ్లాడని తెలిపాడు. ‘‘వారణాసి వెళుతూ మేము కాన్‌పూర్ స్టేషన్‌లో ఆగాము. డెలివరీ ఏజెంట్ ఇక్కడకు రాబోతున్నాడు. ఈ స్టేషన్‌లో రైలు కేవలం ఐదు నిమిషాలే ఆగుతుంది. కానీ కంపెనీ ఈ మొత్తం వ్యవహారాన్ని అద్భుతంగా సమన్వయం చేయడంతో నేనున్న కోచ్ వద్దకే డెలివరీ ఏజెంట్ రాబోతున్నాడు’’ అంటూ అతడు తన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆర్డర్ అందుకున్న తరువాత రైల్లో బక్లీ ఫుడ్ ఎంజాయ్ చేశాడు. ఈ సౌకర్యం నిజంగా అద్భుతమని అన్నాడు.
ఇక ఈ వీడియో నెటిజన్లను అమితంగా మెప్పించింది. ఇండియాలో ఇలాంటి అద్భుతాలు అనేకం ఉన్నాయని జనాలు అతడికి చెప్పారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తే మరింత అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఇలా సానుకూల కామెంట్స్, కంటెంట్ చేసే కంటెంట్ క్రియేటర్ల అవసరం డిజిటల్ ప్రపంచంలో ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక బక్లీ వీడియోకు ఇప్పటివరకూ సుమారు 7 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. మరో వైపు, డెలివరీ యాప్స్‌తో పాటు ఆధునిక సాంకేతికలో పరిశోధనలు చేసే స్టార్టప్‌ల అవసరం కూడా ఉందని నెటిజన్లు కొందరు కామెంట్ చేశారు. మరి జనాల్ని ఇంతగా ఆకట్టుకుంటున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి:
లక్ అంటే ఇదీ.. లాటరీలో రూ.43 లక్షల.. ఆపై మరో 86 లక్షల గెలుపు
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..