ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భారత్‌లో పరిస్థితులు ఇంకా మారలేదని ఇప్పుడే అర్థమైంది.. ఎన్నారై విచారం

ABN, Publish Date - Jan 13 , 2025 | 08:41 PM

మారథాన్‌లల్లో పాల్గొనడం, గిటార్ వాయించడం వంటి హాబీలున్నందుకు ఓ అభ్యర్థిని తిరస్కించిన వింత అనుభవం తనకు భారత్‌లో ఎదురైందంటూ ఓ ఎన్నారై పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. గూగుల్‌లోనూ ఇలాంటివి చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల పనిగంటలపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్ఫీ నారాయణమూర్తి సూచనతో మొదలైన ఈ కాంట్రవర్సీ ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన ‘వారానికి 90 పని గంటల’ సూచనతో పతాకస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని పరిస్థితులపై ఓ ఎన్నారై చేసిన కామెంట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).

టాట్లర్ ఏసియా సీఓఓ పర్మీందర్ సింగ్ కొన్నేళ్ళ క్రితం తనకు ఇండియాలో ఎదురైన అనుభవాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘ఓసారి ఓ అభ్యర్థి మార్కెటింగ్ జాబ్‌కు నాకు దరఖాస్తు చేసుకున్నాడు. అతడు సమర్థుడైన మార్కెటింగ్ ప్రొఫెషనల్ మాత్రమే కాకుండా తనకు మారథాన్‌, గిటార్ వాయించడం వంటి హాబీలు ఉన్నాయని తెలిపాడు. కానీ నా బాస్ అతడిని ఉద్యోగంలోకి తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ‘ఇతడికి ఇన్ని హాబీలు ఉంటే ఇక ఆఫీసులో పనేం చేస్తాడు’ అని నా బాస్ నాతో అన్నాడు. దీంతో, నేను అతడికి జాబ్ ఇవ్వలేకపోయాను. ఇది తలుచుకుంటే ఇప్పటికీ విచారం కలుగుతుంది’’


Viral: భారతీయ గురువు ఇచ్చిన స్ఫూర్తితో పాకిస్థానీ సివిల్స్‌కు ప్రిపరేషన్!

‘‘ఆ తరువాత నేను విదేశాలకు వెళ్లాను. గూగుల్‌లో కూడా పనిచేశాను. అక్కడ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ అప్రకటిత విధానం ఏంటంటే.. నువ్వు ఒలింపిక్స్‌లో పాల్గొని ఉంటే నేరుగా వచ్చి జాబ్‌ చేసుకోవచ్చు. ఒక విషయంలో నైపుణ్యం ఉన్న వారు మరో రంగానికి తమ నైపుణ్యాలను బదిలీ చేయగలరనే నమ్మకమే దీనికి కారణం. కానీ ఇండియాలో ఇంకా పరిస్థితి మారలేదనిపిస్తోంది’’ అని పోస్టు పెట్టారు.

Viral: చేతిలో మరో జాబ్ ఆఫర్ లేకపోయినా ఇన్ఫోసిస్‌ ఉద్యోగానికి టెకీ రాజీనామా! కారణం ఏంటంటే...


ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ దురదృష్టకర పరిస్థితులు ఇంకా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ‘‘విభిన్న అంశాలపై ఆసక్తి ఉన్న వారే అసలైన సృజనాత్మకత కలిగి ఉంటారు. వారిలో సహజసిద్ధమైన కుతూహలం ఉంటుంది. వాళ్లు అసలైన లీడర్లు, పుస్తకాల పురుగులు కారు’’ అని ఓ వ్యక్తి అన్నారు. ఇలాంటిది తానెప్పుడూ వినలేదని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. అభ్యర్థులకు హాబీలు అదనపు అర్హతగా మారతాయని తెలుసు కానీ ఇలాంటి జరుగుతుందని మాత్రం అస్సలు ఊహించలేదని చెప్పారు. ‘‘మీ బాస్ అభద్రతా భావంతో ఉన్నట్టు ఉన్నారు. ఇలాంటి వాళ్లు ప్రతి సంస్థలో ఉంటారు. వాళ్లకు ఎలాంటి హాబీలు ఉండవు కాబట్టి అవి ఉన్న వారు అసమర్థులని అనుకుంటారు’’ అని కామెంట్ చేశారు.

Read Latest and Viral News

Updated Date - Jan 13 , 2025 | 08:41 PM