Viral: లండన్‌లో నెలకు రూ.లక్ష ఇంటి అద్దె కడుతున్నా తప్పని ఇక్కట్లు.. ఎన్నారై వీడియో వైరల్
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:33 PM
లండన్‌లో ఉంటూ ఇంటికి నెలకు రూ.లక్ష అద్దె చెల్లిస్తున్న వ్యక్తి అక్కడ పైకప్పు నుంచి నీరు లీకవుతుంటే విసిగిపోయాడు. చివరకు తన ఆవేదనను నెట్టింట పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో లండన్ కూడా ఒకటి. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో భారతీయులు అనేక మంది ఉంటున్నారు. ఏటా అనేక మంది ఎన్నో కలలతో చదువులు, ఉద్యోగాల కోసం లండన్‌కు తరలిపోతున్నారు. సరిగ్గా ఇలాగే లండన్‌కు వెళ్లిన ఓ భారతీయ యువకుడు తాను పడుతున్న కష్టాలు చెప్పుకుంటూ నెట్టింట పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది (Viral).
ఆర్యన భట్టాచార్య అనే యువకుడు ఈ వీడియో పోస్టు చేశారు. తాను లండన్‌లో నెలకు రూ.లక్ష అద్దె చెల్లిస్తున్నా కనీస సౌకర్యాలు లేని ఇంట్లో ఉంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Viral: ఇలా తయ్యారయ్యారేంట్రా బాబూ.. రైలు దిగేముందు ఈ ప్రయాణికులు ఏం చేశారో చూస్తే..
ఇంటిపై కప్పు నుంచి నీరు నీకవుతూనే ఉందని, దీంతో, రకరకాల గిన్నెలు, పాత్రలు పెట్టి ఇల్లు నీటిమయం కాకుండా ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. వీడియో రికార్డు చేసే సమయానికి చీకటి పడటంతో ప్లంబర్ ఎవరూ రారని చెప్పారు. ఆ రోజు ఉదయమే ప్లంబర్ వచ్చి వెళ్లినా ప్రయోజనం లేకపోయిందని అన్నాడు. రేపు మరోసారి ఫిర్యాదు చేస్తానని అన్నాడు. ఇండియాలోని ఛాల్స్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని అన్నాడు. ముంబై వంటి నగరాల్లో చిన్న చిన్న గదులు ఉండే భవనాలను ఛాల్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఉండే వారు కనీస వసతులు లేక నానా అవస్థా పడుతుంటారు.
Viral: వామ్మో.. ఎంత ప్రమాదం తప్పింది! జిమ్‌కు వెళ్లేవాళ్లు తప్పక చూడాల్సిన వీడియో!
ఇక వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు యువకుడి పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. కొందరు లోకల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తే మరికొందరు మాత్రం పరిస్థితికి సర్దుకుని ఆర్థిక స్థితి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ‘‘లండన్‌లో జీవన వ్యయాలు ఎక్కువగా ఉంటాయని తెలిసీ ఆ నగరాన్ని ఎంచుకున్నావు. కాబట్టి, పరిస్థితికి సర్దుకుపోయి ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయాలి. జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయంపై విమర్శించుకుంటూ ఉంటే లైఫ్‌లో ముందుకెళ్లలేము’’ అని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు.
తనకు ఇలాంటి అనుభవం ఎదురైందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. బాత్రూమ్‌లో లీక్ కారణంగా నాలుగు రోజులు అవస్థ పడాల్సి వచ్చిందని అన్నారు. సమస్య పరిష్కారానికి నాలుగు రోజులు పట్టిందని ఆ సమయంలో చుక్కలు కనిపించాయని చెప్పుకొచ్చారు. మరికొందరు మాత్రం యువకుడు స్వదేశానికి తిరిగి రావాలని సలహా ఇచ్చారు.