Viral: భూటాన్‌లో భారతీయ పెట్రోల్ పంప్.. లీటర్ ఇంధనం ధర ఎంతో తెలిస్తే..

ABN, Publish Date - Feb 14 , 2025 | 05:19 PM

భూటాన్‌లోని భారత్ పెట్రోలియం పెంట్రోల్ బంకులో లీటరు పెట్రోలు ధర కేవలం రూ.64 అని తెలుసి జనాలు షాకైపోతున్నారు. ఇందుకు సంబంధించి ఓ పర్యాటకుడు షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: భూటాన్‌లో భారతీయ పెట్రోల్ పంప్.. లీటర్ ఇంధనం ధర ఎంతో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికీ రూ.100 లోపే ఉంటుంది. కానీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలుగు రాష్ట్రాల వంటి చోట్లు పెట్రోల్ ధర ఎప్పుడో వంద మార్కు దాటేసింది. ఇలాంటప్పుడు పొరుగు దేశాల్లో పరిస్థితి ఏంటో అనే సందేహం కలగకమానదు. ఈ ప్రశ్నకు అర్బాజ్ ఖాన్ అనే ఓ వ్యక్తి తాజాగా సమాధానం చెప్పాడు. భూటాన్ వెళ్లిన అతడు అక్కడ భారత్ పెట్రోలియం సంస్థకు చెందిన పెట్రోల్ బంక్‌ కనిపించే సరికి ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత లీటర్ ధర ఎంతో చూసి మరింతగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).

ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్! మహిళా కస్టమర్ చెంప ఛెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డు!


భూటాన్‌లో ఇంధన ధరలు అదీ మన భారతీయ సంస్థ విక్రయిస్తున్న పెట్రోల్ ధరలు తక్కువగా ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని అర్బాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ‘‘ఈ రోజు ఓ అద్భుతం చూశాను. ప్రస్తుతం నేను భూటాన్‌లో ఉన్నాను. ఇక్కడ భారతీయ సంస్థ పెట్రోల్ పంప్స్‌ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడి ఇంధన ధరలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, కెమెరాను పెట్రోల్‌ బంక్‌పై చూపించి అక్కడ కనిపిస్తున్న ధరను రికార్డు చేశాడు. లీటర్ ధర కేవలం రూ.64 (భారత కరెన్సీలో చెప్పుకోవాలంటే రూ.63.92) గా కనిపించింది. భారతీయ సంస్థ అమ్మె పెట్రోల్ ఇంత తక్కువగా అని తెలిసి తనకు ఆశ్చర్యం వేసినట్టు చెప్పుకొచ్చాడు.

ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయా? నమ్మకస్తులైన ఉద్యోగులకు రూ.10 లక్షల బోస్!


భారత్, భూటాన్ కరెన్సీల మధ్య మారకం విలువ పెద్ద తేడాగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంటే. ఇక్కడ లీటరు రూ.100కు లభించే పెట్రోల్ అక్కడ రూ.64కే లభిస్తోందన్నమాట. ఇక సదరు యూట్యూబర్ తన వీడియోలో ఇరు దేశాల సరిహద్దును కూడా చూపించాడు.

పెట్రోల్ ధరల్లో ఇంత వ్యత్యాసం కనిపించడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. దీంతో, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. భారత్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వధించే వివిధ పన్నుల కారణంగా పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని కొందరు వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కాస్త సడలింపు ఇస్తే సామాన్యులకు ఉపయోగం అని అంటున్నారు. కొందరు మాత్రం ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!

Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!

Read Latest and Viral News

Updated Date - Feb 14 , 2025 | 05:19 PM