Viral: దేశసంపదలో 18 శాతం 2 వేల కుటుంబాల చేతుల్లోనే! బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ పోస్టు వైరల్
ABN, Publish Date - Jan 06 , 2025 | 09:10 PM
దేశంలో 18 శాతం సంపద సొంతం చేసుకున్న 2 వేల కుటుంబాలు కేవలం 1.8 శాతం పన్ను మాత్రమే చెల్లిస్తున్నాయంటూ ఓ కంపెనీ సీఈఓ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అనేక దేశాల్లో ఆర్థిక తారతమ్యాలు హద్దులు దాటుతున్నాయి. పేదలు మరింతగా పేదరికంలో కూరుకుపోతుంటే ధనికుల సంపద అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరిస్థితులపై నైరాశ్యం వ్యక్తం చేస్తూ బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతను దేశ్‌పాండే పెట్టిన పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ పోస్టుపై అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వ విధానాలే ఈ దుస్థితికి కారణమంటూ నిందించారు(Viral).
శంతను లింక్డ్‌ఇన్‌లో ఈ పోస్టు పెట్టారు. ‘‘ఈ మధ్య నాకో విషయం గ్రహింపునకు వచ్చింది. అదేంటంటే.. అనేక మందికి తాము చేస్తున్న ఉద్యోగం నచ్చదు. దేశంలో ప్రతి ఒక్కరికీ జీవికకు కావాల్సిన డబ్బు, ఆర్థిక భద్రత ఇస్తే 99 శాతం మంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పేస్తారు’’
‘‘కార్పొరేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు.. గిగ్ వర్కర్లు, ఇన్సూరెన్స్ సేల్స్‌మెన్, బ్యాంకు ఉద్యోగులు, చిరు వ్యాపారులు.. ఉద్యోగుల అనుకూల విధానాలు పాటించే స్టార్టప్‌ల సహా అందరిదీ ఇదే కథ. వాస్తవం కూడ అదే’’
Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..
‘‘చాలా మంది ఏమీ లేని స్థితి నుంచి తమ ప్రయాణం ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు లేదా తోడబుట్టిన వారి కోసం విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తుంటారు. గంటలు, రోజులు, వారాల తరబడి కుటుంబానికి దూరంగా పని చేస్తుంటారు. ఇదంతా సాధారణమని మనమంతా భావిస్తాం. ఎందుకంటే గత 250 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. అనేక దేశాల నిర్మాణం ఇలాగే జరిగింది’’
‘‘కానీ ఆలోచించేకొద్దీ నాకు ఈ విధానంలో అసమానతలు కనిపిస్తున్నాయి. మన దేశ సంపదలో 18 శాతం 2 వేల కుటుంబాల చేతుల్లో ఉంది. కాని వారు చెల్లించే పన్ను మాత్రం 1.8 శాతమే. ఇది మతిపోగొట్టే గణాంకాలు. వీటిల్లో ఏవో కొన్ని మార్పులు ఉంటే ఉండొచ్చు’’
Viral: గ్యాస్ ఏజెన్సీ ఇవ్వాల్సిన రూ.1.5 చిల్లర కోసం 7 ఏళ్ల పాటు పోరాడి గెలిచిన వినియోగదారుడు!
‘‘కష్టపడితేనే సంపద సొంతమవుతుందన్న భావన వ్యాప్తిలో పాత్ర ఈ సంపన్న కుటుంబాలతో పాటు నాకూ ఉంది. కానీ ఇది సంపన్నులకు మాత్రమే లాభించే విధానం. కానీ మనకి మరొక ప్రత్యామ్నాయం ఏమీ లేదు. మరో మార్గమేదీ తెలియదు’’
‘‘ మన దేశంలో 75 శాతం బిలియనీర్లు సొంత కష్టంతో పైకెదిగిన వారే కానీ ఈ సక్సెస్‌ను అతి కొద్ది మంది మాత్రమే సాధించగలిగారు. దేశంలో దాదాపు బిలియన్ మంది ఉన్నారు. కానీ ఎంత మంది స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించగలరు?’’ అని ఆయన రాసుకొచ్చారు. తన మనసులో మాట పంచుకునేందుకు ఈ పోస్టు పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఎందరో కష్టమైన జీవితాన్ని గడుపుతున్నారని, భుజాలపై కనిపించని భారాన్ని మోస్తూ ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇలాంటి వారు పైకెదిగేందుకు ధనవంతలు మానవత్వంతో సాయం చేయాలని పిలుపునిచ్చారు.
Viral: చిరుత వేటకు జింక బలి.. షాక్‌లో మరో 7 జింకల మృత్యువాత
Updated Date - Jan 06 , 2025 | 09:10 PM