Viral: మహాకుంభ మేళాకు వచ్చిన సన్యాసి.. యూట్యూబర్ పిచ్చి ప్రశ్నలతో తిక్కరేగి..
ABN, Publish Date - Jan 13 , 2025 | 10:00 PM
మహాకుంభమేళాకు వచ్చిన ఓ బాబా తనకు పిచ్చి ప్రశ్నలో చిరాకు తెప్పించిన యూట్యూబర్‌ను తన వద్ద ఉన్న చిడతలతో చితకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కొంత కాలం క్రితం వరకూ ప్రాంక్ వీడియోలు జనాలకు తెగ చిరాకు తెప్పించిన విషయం తెలిసిందే. ముక్కూముఖం తెలియని వారితో పరాచకాలు ఆడుతూ వీడియోలు తీసే యూట్యూబర్‌లపై జనాలకు విసుగొచ్చేసింది. ప్రాంక్ వీడియోల చేసిన వారిని నిలబెట్టి దుమ్ముదులుపుతుండటంతో ఈ వీడియోలు తగ్గింది. అయితే, కనిపించిన వారినల్లా తమ ప్రశ్నలతో విసిగించే తీరును మాత్రం యూట్యూబర్లు మార్చుకోవట్లేదు. ఇక కుంభమేళాలో ఇలాంటి పైత్యానికి దిగిన యూట్యూబర్‌కు తాజాగా భారీ షాక్ తగిలింది (Viral)..
కుంభమేళాలో పాల్గొనేందుకు, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో స్నానమాచరించి ముక్తి పొందేందుకు లక్షలకొద్దీ భక్తులు, సాధువులు యూపీకి తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబర్ అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్న సాధువును మాటల్లో పెట్టాడు.
Viral: చేతులారా పెళ్లి చెడగొట్టుకున్న వరుడు.. ఏం జరిగిందో తెలిస్తే..
తొలుత వారి సంవాదం సాఫీగానే మొదలైంది. మీరు సాధువుగా ఎప్పుడు మారారు అని యూట్యూబర్ ప్రశ్నిస్తే చిన్నప్పుడే అని బాబా సమాధానం ఇచ్చారు. కానీ యూట్యూబర్ అక్కడితో ఆగిపోలేదు. దేవుడి కోసం మీరు ఏ భజనలు చేస్తారని ప్రశ్నించారు. ఈ తిక్క ప్రశ్నతో తిక్కరేగిన బాబా పక్కనే ఉన్న చిడతలను తీసుకుని యూట్యూబర్‌ను కొట్టడం ప్రారంభించారు. దీంతో, యూట్యూబర్ భయపడిపోయాడు. అయితే, సాధువు మాత్రం పిచ్చి ప్రశ్నలు అడుగుతావా అంటూ ఉతుకుడు కొనసాగిస్తుండటంతో భయపడిపోయిన యూట్యూబర్ సాధువు గుడారం నుంచి పారిపోయాడు. పక్కనే ఉన్న ఇతరులు ఈ వీడియోను రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
Viral: ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హెర్ ఆర్ అధిపతి
కాగా, కుంభమేళా తొలి రోజునే రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. త్రివేణి సంగమంలో ఏకంగా 1.50 కోట్ల మంది పవిత్రస్నానం ఆచరించారు. ఉత్తరాదితో పాటు దక్షిణాది నుంచి లక్షల కొద్దీ భక్తులు తరలిరావడంతో ప్రయాగ్ రాజ్‌లో ఘాట్‌లు అన్నీ కిటకిటలాడాయి. మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన భక్తులకు సీఎం యోగి అభినందనలు తెలియజేశారు. ఈ పండుగను విజయవంతం చేశారని అన్నారు. ఇక ప్రయాగ్‌రాజ్ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు సామాజిక అంతరాలు మరిచి భక్తిభావంలో పడి పులకించిపోయారు. భజనలు, జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది.
Viral: చేతిలో మరో జాబ్ ఆఫర్ లేకపోయినా ఇన్ఫోసిస్ ఉద్యోగానికి టెకీ రాజీనామా! కారణం ఏంటంటే...
Updated Date - Jan 13 , 2025 | 10:44 PM