Jyothiradhitya Scindia: కేంద్ర మంత్రి ముందు గుట్కా తిన్న మహిళ.. చివరకు ఏమైందంటే..
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:17 PM
గుట్కా తింటున్న ఓ మహిళను కేంద్ర మంత్రి మందలించారు. ఆమె వద్ద ఉన్న మరో గుట్కా ప్యాకెట్‌ను కూడా తీసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ సున్నితంగానే నచ్చచెప్పారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: గుట్కా ఓ వ్యసనం. ఒక్కసారి అలవాటు పడితే ఇక బయటపడటం కష్టం. ఎదుట ఎవరు ఉన్నా వ్యసనపరులు తమ పని తాము కానిచ్చేస్తుంటారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదుదయ్యింది. గుట్కాకు అలవాటు పడిన మహిళ ఏకంగా కేంద్ర మంత్రి ముందే గుట్కాను ఎంజాయ్ చేసింది. గురువారం ఖానియాదాలో ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. అయితే, అక్కడకు వచ్చిన ఓ మహిళ యథేచ్ఛగా గుట్కా తినడం మంత్రి కంటపడింది. గుట్కా ఆరోగ్యానికి ఎంత ప్రమాదమూ తెలిసిన మంత్రి ఆమె వద్దకు వెళ్లారు. సోదరీ.. నువ్వు గుట్కా తినడం నేను చూశాను లే. గుట్కా మంచిది కాదు’’ అంటూ నిర్మొహమాటంగా ఆమెతో అన్నారు. మహిళపై కోపం ప్రదర్శించకుండానే నిష్కర్షగా ఆమెను హెచ్చరించారు.
అంతేకాకుండా, ఆమె బ్యాగులోని గుట్కా ప్యాకెట్‌ను కూడా బయటకు తీయించి తన సిబ్బందికి ఇచ్చి బయటపారేయించాడు. ఆ తరువాత వాతావరణం కూల్ చేసేందుకు మహిళను చూస్తూ జోక్ చేశారు. ‘‘నీ సుపారీ తీసేసుకున్నందుకు చింతించకు. నీ ఆరోగ్యానికి మేలు జరిగినందుకు సంతోషించు’’ అని సరదా కామెంట్ చేశారు. దీంతో, చుట్టుపక్కల ఉన్న వారందరూ గొల్లున నవ్వారు. కాగా, ఈ వీడియోపై నెట్టింట కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది సింధియా తీరును ప్రశంసించారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లు గుట్కాతో ముప్పుపై అవగాహన పెరుగుతుందని అన్నారు.
గుట్కాతో క్యాన్సర్ ప్రమాదం ఉన్న విషయం తెలిసిందే. ఈ అలవాటుతో నోటి క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యసనం ఉన్న వారిలో ఆకలి మందగించడం, రోగ నిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలు ఉంటాయి. డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి మానసిక రుగ్మతలు కూడా వేధిస్తాయి. ఇక గుట్కా ఉమ్మిలతో పరిసరాలు పాడవుతాయి. భారత్ నుంచి సందర్శించే విదేశీయుల ముందు తలవంపులు తెచ్చుకోవాల్సి వస్తుంది. గుట్కాతో ఇన్ని సమస్యలు ఉన్నా దేశంలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పులు మాత్రం రావట్లేదు.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీని కాపాడుకునేందుకే బీజేపీతో ఎడప్పాడి పొత్తు.. డీఎంకే స్పందన
అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. అమిత్‌షా బిగ్ స్టేట్‌మెంట్
ఎన్‌ఐఏ దర్యాప్తునకు ముంబై పోలీసుల సహకారం: ఫడ్నవిస్