Viral: రూ.30 లేక ఆసుపత్రి బయటే నిద్ర.. చలికి తట్టుకోలేక మృతి
ABN, Publish Date - Jan 14 , 2025 | 10:52 PM
ఆసుపత్రి డార్మిటరీ వినియోగించుకునేందుకు రూ.30 లేక ఓ వ్యక్తి మూడు రోజుల పాటు బయటే నిద్రించాడు. చివరకు చలికి తట్టుకోలేక కన్నుమూశాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: మైసూరులో తాజాగా హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఆసుపత్రి డార్మిటరీలో పడుకునేందుకు రూ.30 చెల్లించలేకపోయిన ఓ వ్యక్తి మూడు రాత్రుళ్లు వరుసగా బయటే పడుకుని కన్నుమూశాడు.
జిల్లాకు చెందిన 35 ఏళ్ల శివగోపాలయ్య భార్య ఇటీవలే ప్రసవించింది. పండంటి బిడ్డ జన్మించాడు. తల్లి బిడ్డ ఇద్దరినీ వైద్యులు ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు ఏ సమయంలోనైనా తనను పిలవొచ్చనే ఉద్దేశంతో శివగోపాలయ్య ఆసుపత్రిలో ఉండేందుకు వచ్చాడు. అయితే, అక్కడి డార్మిటరీలో నిద్రించేందుకు రూ.30 చెల్లించాల్సి ఉండగా అతడి వద్ద అంత డబ్బు లేదు (Viral).
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక అమ్మేసిన కుటుంబ సభ్యులు.. తట్టుకోలేక టీనేజర్ ఆత్మహత్య
అయితే, వైద్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అతడు ఆసుపత్రి బయట చలిలోనే నిద్రించాడు. ఇలా వరుసగా మూడు రోజుల పాటు బయటే పడుకోవడంతో చివరకు మృత్యువాత పడ్డాడు.
కాగా, శివగోపాలయ్య వద్ద డబ్బే లేదని ఆసుపత్రిలో ఉంటున్న మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. అతడి తిండికి తామే డబ్బు చెల్లించినట్టు చెప్పుకొచ్చాడు. ఆసుపత్రి వైద్యుల్లో ఒకరు శివగోపాలయ్య బిడ్డకు పాల పౌడర్ కొనేందుకు అతడికి స్వయంగా డబ్బు ఇచ్చాడు. కాగా, ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రిలో డార్మటరీలు అందుబాటులో ఉన్నా అతడు లోపలకు రాలేదని చెప్పారు. మరుసటి రోజు ఉదయం తమకు ఈ దారుణం గురించి తెలిసిందని అన్నారు.
Viral: ఆటో డ్రైవర్‌ను పబ్లిక్‌గా చెంపలు వాయించిన యువతి.. షాకింగ్ వీడియో
కాగా, మృతుడి భార్య అప్పటికి ఐసీయూలోనే ఉండటంతో భర్త పోయిన విషయం ఆమెకు ఇంకా తెలియలేదు. బిడ్డ కోసం ఎదురుచూస్తున్న శివగోపాలయ్య కుటుంబ సభ్యులు అతడి మరణం గురించి తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు.
బెంగళూరులో వెలుగు చూసిన మరో ఘటనలో ఓ ఆరేళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు నేపాల్‌కు చెందిన వారు. స్థానికంగా ఓ చోట సెక్యూరిటీగా చేస్తున్నారు. సోమవారం రాత్రి నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు నిందితుడిని గుర్తించి దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు.
Updated Date - Jan 14 , 2025 | 10:59 PM