kuno cheetahs: రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు
ABN, Publish Date - Apr 07 , 2025 | 06:42 PM
నిబంధనలకు విరుద్ధంగా చీతా దాహం తీర్చిన ఇద్దరు అటవీ శాఖ సిబ్బందిపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.

ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, దాహం తీర్చడం మానవత్వానికి చిహ్నం. అయితే, క్రూర జంతువుల విషయంలో మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కానీ ఓ ఇద్దరు గ్రామస్థులు మాత్రం ఇవ్వన్నీ మర్చిపోయారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సూచనలను కూడా పక్కనపెట్టేశారు. చీతా దాహం తీర్చడం పేరిట నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి చివరకు చిక్కుల్లో పడ్డాడు.
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఏప్రిల్ 4న ఈ ఘటన వెలుగు చూసింది. కూనో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి జ్వాలా అనే చీతా తన కూనలతో కలిసి సమీపంలోని పొలాల్లోకి వచ్చింది. అక్కడే ఆరు గొర్రెలను వాటాడి తినేసింది. ఇదిలా ఉంటే, వణ్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ నియమించిన ఇద్దరు గ్రామస్థులు నిబంధనలను పక్కన పెట్టి వాటికి నీరు అందించారు. డ్రైవర్ సత్యనారాయణ్ గుర్జర్‌తో పాటు ఫారెస్ట్ గార్డు రావత్ చీతాలను పిలిచి మరీ ఓ గిన్నెలో నీరు పోసి ఇచ్చారు. ఈ ఉదంతాన్ని వీడియోలో రికార్డు కూడా చేసుకున్నారు.
ఇది నెట్టింట బాట పట్టడంతో వారిపై ప్రశంసలు వచ్చినా అటవీ శాఖ అధికారులు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
‘‘చీతాలకు దూరంగా ఉండాలని, కచ్చితనమైన మార్గదర్శకాలు ఇచ్చాము. ఈ విషయంలో శిక్షణ కూడా ఇచ్చాము. అనుమతి ఉన్న సిబ్బంది మాత్రమే చీతాలను సమీపించొచ్చు. కానీ ఈ ఘటనలో మాత్రం క్షేత్రస్థాయిలోని సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించారు. క్రమశిక్షణా రాహిత్యం ప్రదర్శించారు. ఇది చాలదన్నట్టు తాము చేసిన పనిని వీడియోలో రికార్డు చేసి అనవసరంగా ప్రజల దృష్టిలో పడ్డారు’’ అంటూ అటవీ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రొటోకాల్ ప్రకారం, సిబ్బంది చీతాలను జాగ్రత్తగా వణ్యప్రాణి సంరక్షణాలయం వైపు దారి మళ్లించాలి. చీతాలు పొలాల్లోకి వచ్చినప్పుడు అదనపు సిబ్బందిని పిలిపించుకోవాలి. కానీ ఇద్దరు సిబ్బంది మాత్రం తమతంట తాము చీతాల దగ్గరకు వెళ్లి నీళ్లు అందివ్వడం అటవీ శాఖ సీరియస్‌గా తీసుకుని బాధ్యులను సస్పెండ్ చేసింది. మరోవైపు, చీతాలకు నీళ్లు ఇస్తున్న వీడియో మాత్రం నెట్టింట ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతూ జనాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఇవి కూడా చదవండి:
పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఏటా రూ.40 లక్షల ఆదాయం.. నెట్టింట పోస్టు వైరల్
మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని.. ఆమె తండ్రి అస్థికలు దొంగిలించి..
ఇతరులను టచ్ చేస్తే షాక్.. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా
Updated Date - Apr 07 , 2025 | 06:43 PM