ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హెర్ ఆర్ అధిపతి

ABN, Publish Date - Jan 13 , 2025 | 09:11 PM

ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ వ్యాఖ్యలపై హెచ్ఆర్ విభాగం అధిపతి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ (ఎస్ఎన్ఎస్) చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదానికి దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులతో పాటు కార్పొరేట్ బాస్‌లు కూడా ఈ వ్యాఖ్యలను తమదైన శైలిలో ఖండించారు. ఈ కామెంట్స్ తెరపైకి వచ్చి రోజులు గడుస్తున్నా ఇంకా ట్రెండింగ్‌లో ఉండటంతో సంస్థ హెచ్ ఆర్ విభాగం అధిపతి సోనికా మురళీధరన్ తాజాగా స్పందించారు. అసలు ఏం జరిగిందీ వివరిస్తూ సవివరమైన పోస్టు పెట్టారు (Viral).

సుబ్రమణియన్ ఆ వ్యాఖ్యలను ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో అన్నదీ ఆలోచించకుండా తప్పుగా అర్థం చేసుకున్నారని సోనికా వాపోయారు. ఈ కామెంట్స్ వెలుగు చూసిన మీటింగ్‌లో ఆయన ఎక్కడా 90 గంటలు తప్పనిసరి అని అనలేదని స్పష్టం చేశారు. చాలా సరదాగా అలా కామెంట్ చేశారని వివరించారు. ఆయన నాయకత్వ శైలికి ప్రస్తుత కాంట్రవర్సీ పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఉద్యోగులకు అండగా ఉంటారని, వారి శ్రేయస్సుపై దృష్టి పెడతారని, అందరినీ కలుపుకుని వెళతారని కామెంట్ చేశారు.


Viral: భారత్‌లో పరిస్థితులు ఇంకా మారలేదని ఇప్పుడే అర్థమైంది.. ఎన్నారై విచారం

ఈ సందర్భంగా ఆయనతో కలిసి దాదాపు ఐదేళ్ల పాటు పని చేసిన విషాయన్ని సోనికా ప్రస్తావించారు. తద్వారా ఆయన నాయకత్వ శైలి ఏంటో తనకు అర్థమైందని అన్నారు. సుబ్రమణియన్ విజన్ ఉన్న నాయకులని, ఉద్యోగులను తనకు అయినవారిగా చూస్తారని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు తగిన గుర్తింపు దక్కేలా చూస్తూ మద్దతు ఇస్తూ వృత్తిపరమైన బాధ్యతలను పక్కాగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాకుండా, స్కిల్ డెలవలప్‌మెంట్, వ్యక్తిగత అభివృద్ధిని కోరుకుంటారని అన్నారు.

Viral: భారతీయ గురువు ఇచ్చిన స్ఫూర్తితో పాకిస్థానీ సివిల్స్‌కు ప్రిపరేషన్!


ఎస్ఎన్ఎస్ ఎంత బిజీగా ఉన్నా ఉద్యోగులతో చర్చించేందుకు, వారి సాధకబాధకాలను కనుక్కునేందుకు సమయం కేటాయిస్తారని సోనికా తెలిపారు. ఉద్యోగులతో తరచూ మాటకలుపుతూ తాను స్వానుభవంలో తెలుసుకున్న ఎన్నో జీవిత పాఠాలను వారితో పంచుకుంటారని అన్నారు.

కాగా, సుబ్రమణియన్ వ్యాఖ్యలపై సాటి కార్పొరేట్లు కూడా చురకలు అంటించిన విషయం తెలిసిందే. హర్ష గోయెంకా మొదలు, ఆనంద్ మహీంద్రా వరకూ అనేక మంది వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఎంత సేపు పని చేశామనేదానికంటే.. పనిలో నాణ్యత ఎంత ఉందనేదే ముఖ్యమని తేల్చి చెప్పారు.

Viral: చేతిలో మరో జాబ్ ఆఫర్ లేకపోయినా ఇన్ఫోసిస్‌ ఉద్యోగానికి టెకీ రాజీనామా! కారణం ఏంటంటే...

Read Latest and Viral News

Updated Date - Jan 13 , 2025 | 09:22 PM