Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:46 PM
కేరళలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరికి కోడి పుంజు విషయంలో గొడవ మొదలైంది. పక్కింట్లో ఉన్న కోడి వల్ల తనకు మనశాంతి లేకుండా పోతోందని భావించిన ఓ వ్యక్తి ఏకంగా దానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు.

సాధారణంగా పక్క పక్క ఇళ్లలో నివసించే వారికి స్థలం విషయంలో, మురుగు నీటి కాలువలో విషయంలో గొడవలు వస్తాయి. అయితే కేరళ (Kerala)లోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరికి మాత్రం కోడి పుంజు (Rooster) విషయంలో గొడవ మొదలైంది. పక్కింట్లో ఉన్న కోడి వల్ల తనకు మనశాంతి లేకుండా పోతోందని భావించిన ఓ వ్యక్తి ఏకంగా దానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. కోడి తెల్లవారుఝామున మూడు గంటలకు కూస్తుండడంతో తన నిద్ర చెడిపోతోందనేది అతడి ఫిర్యాదు (Viral News).
రాధాకృష్ణ కురుప్ అనే వృద్ధుడు తన పక్కింట్లో ఉంటున్న అనిల్ కుమార్‌కు చెందిన కోడి కూతల వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. ప్రతిరోజు తెల్లవారు ఝామున 3 గంటలకు, పొరుగింటి కోడి ఎడ తెగకుండా కూస్తుండడం వలన కురుప్‌నకు నిద్ర పట్టడం కష్టమై, అతని ప్రశాంతమైన జీవితానికి అంతరాయం కలిగింది. దీంతో అతడు.. అనిల్ కుమార్ కోడి తన నిద్రకు భంగం కలిగిస్తోందని అడూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (RDO)లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదును ఆర్‌డీవో అధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఈ సమస్య గురించి చర్చించడానికి కురుప్, అనిల్ ఇద్దరినీ ఆఫీస్‌కు పిలిపించారు. అలాగే ఇద్దరి ఇళ్లను పరిశీలించారు. అనిల్ తన ఇంటి పై అంతస్తులో కోడిని ఉంచినట్టు అధికారులు కనుగొన్నారు. అలాగే రోజూ తెల్లవారుఝామునే అరుస్తున్నట్టు స్వయంగా తెలుసుకున్నారు. దీంతో ఆ కోళ్ల షెడ్‌ను పై అంతస్తు నుంచి ఇంటి దక్షిణం వైపునకు మార్చాలని అనిల్ కుమార్‌ను ఆర్డీవీ ఆదేశించారు. ఆ తరలింపునకు 14 రోజుల గడువు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..
Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.