Share News

Baba Ramdev: 59 ఏళ్ల వయసులో ఇంత సామర్థ్యం ఏంటి స్వామి.. పరుగు పందెంలో గుర్రాన్ని మించిన బాబా రాందేవ్..

ABN , Publish Date - Feb 19 , 2025 | 03:01 PM

చాలా మంది యువకులకు కొద్ది దూరం నడిస్తేనే చాలా ఆయాసం వచ్చేస్తుంటుంది. జంక్ ఫుడ్ తింటూ, గంటలు గంటలు కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం దీనంతటికీ కారణం అనే సంగతి తెలిసిందే. 40 ఏళ్లకే ఇలా అయిపోతే 60 ఏళ్ల వయసుకు పరిస్థితి ఏంటి?

Baba Ramdev: 59 ఏళ్ల వయసులో ఇంత సామర్థ్యం ఏంటి స్వామి.. పరుగు పందెంలో గుర్రాన్ని మించిన బాబా రాందేవ్..
Baba Ramdev races with horse

ప్రస్తుతం యుక్త వయసు వచ్చే సరికే పలు రకాల అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు యువకులను కూడా లొంగదీసుకుంటున్నాయి. పరిగెత్తడం సంగతి తర్వాత, కొద్ది దూరం నడిస్తేనే చాలా మందికి ఆయాసం వచ్చేస్తుంటుంది. జంక్ ఫుడ్ తింటూ, గంటలు గంటలు కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం దీనంతటికీ కారణం అనే సంగతి తెలిసిందే. 40 ఏళ్లకే ఇలా అయిపోతే 60 ఏళ్ల వయసుకు పరిస్థితి ఏంటి? ఆ వయసులో కూడా అద్భుతమైన ఫిట్‌నెస్ కనబరుస్తున్న యోగా గురు బాబా రాందేవ్ (Baba Ramdev) అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.


బాబా రాందేవ్ తాజాగా తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాబా రాందేవ్ ఓ గుర్రంతో రన్నింగ్ రేస్‌లో (Baba Ramdev races with horse) పాల్గొన్నారు. ఆయన గుర్రంతో సమానంగా అత్యంత వేగంతో పరుగులు పెడుతున్నారు. ఒక దశలో గుర్రం కూడా కొంచెం వెనుకబడింది. తన ఫిట్‌నెస్‌కు కారణం తన పతంజలి ఫుడ్స్ సంస్థ ఉత్పత్తులైన స్వర్ణ శీలజీత్, ఇమ్యునోగ్రిట్ గోల్డ్ కారణమని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ ఉత్పత్తులను వాడితే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు, సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు.


ఆ ఉత్పత్తుల సంగతేమో గానీ, ఆయన స్టామినా మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 59 ఏళ్ల వయసులో బాబా రాందేవ్ ఫిట్‌నెస్ చూసి చాలా మంది షాక్‌ అవుతున్నారు. ఈ వీడియోపై ఏజ్ రివర్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న బ్రయాన్ జాన్సన్ (Bryan Johnson) స్పందించారు. గతంలోలాగానే భారతదేశంలోని గాలి నాణ్యతపై ఆందోళన వెలిబుచ్చుతూ కామెంట్లు చేశారు. దీంతో అతడిని ట్విటర్‌లో రాందేవ్ బ్లాక్ చేశారు. రాందేవ్ తనను బ్లాక్ చేసిన విషయాన్ని కూడా బ్రయాన్ జాన్సన్ తెలియజేశాడు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..


Optical Illusion: మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2025 | 03:04 PM