Share News

Viral: షాకింగ్.. రష్యన్ భార్యతో ఇండియాలో పర్యటిస్తుంటే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 08:39 PM

రష్యన్ భార్యతో కలిసి ఇండియాలో పర్యటిస్తుంటే కొందరు పోకిరీలు వేధింపులకు దిగారంటూ ఓ భారతీయ వ్యక్తి నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ ఉదంతంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral: షాకింగ్.. రష్యన్ భార్యతో ఇండియాలో పర్యటిస్తుంటే..

ఇంటర్నెట్ డెస్క్: రష్యన్ భార్యతో ఇండియాలో పర్యటిస్తున్న ఓ భారతీయుడికి తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అతడు నెట్టింట పంచుకోవడంతో జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది (Viral).

మిథిలేశ్ అనే యూట్యూబర్ ఇటీవల తన రష్యన్ భార్యను తీసుకుని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పర్యటించాడు. ఈ క్రమంలో కొందరు పోకిరీలు తన భార్యను వేధించే ప్రయత్నం చేశారని వాపోయాడు.

‘‘నా కుటుంబంతో కలిసి అక్కడ పర్యటనకు వెళ్లాను. అక్కడ కొందరు యువకులు కనబడ్డారు. నేనూ లీసా నడుచుకుంటూ వెళుతుంటే కొందరు దేవుడు చేసిన జంట అని కామెంట్ చేశాడు. నేను తొలుత పట్టించుకోలేదు. కానీ వారు మాత్రం మమ్మల్ని ఫాలో అయ్యారు. ఈ క్రమంలో నా భార్యను వీడియో తీస్తుండగా ఓ వ్యక్తి డబ్బుల గురించి మాట్లాడాడు. అతడి దురర్థం తెలిసి నాకు సహనం నశించింది’’


Viral: ఎమ్‌బీయే చేశాక జొమాటోలో జాబ్ ఆఫర్ వస్తే సంతోషపడ్డాడు! శాలరీ ఎంతో తెలిశాక..

‘‘వారితో గొడవ పడటం సబబు కాదనిపించింది. పోలీసులే వారికి తగిన బుద్ధి చెబుతారని అనుకున్నాను. కానీ నేను అతడిని పబ్లిక్‌గా నిలదీశాను. డబ్బుల ప్రస్తావన తెచ్చానని అంటూనే అతడు తన స్నేహితుడితో ఆ మాటను అన్నట్టు బుకాయించే ప్రయత్నం చేశాడు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. సిగ్గుమాలినతనం. భారత్‌లో పర్యటించాలని నేను విదేశీయులకు చెబుతుంటా. కానీ నాకే ఇలా జరిగితే ఏమనుకోవాలి’’ అని అతడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

Viral: కలలో కనిపించిన సంఖ్య ప్రకారం లాటరీ టిక్కెట్టు కొన్న మహిళ.. చివరకు ఊహించని విధంగా..


ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అతడికి అండగా నిలిచారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘మన దేశ యువకుల్లో ఇలాంటి తప్పుడు భావనలు వేళ్లూనుకున్నాయి. ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టొద్దు. కఠినంగా శిక్షించాలి. విదేశీయుల మందు ఇలాంటి వాళ్లు మన పరువు తీస్తున్నారు. సమర్థించుకోవడం కష్టంగా మారింది. యువతే దేశం పరువును బజారున పడేస్తుంటే బాధ కలుగుతోంది’’ అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడు చేసిన తప్పునకు అతడికి కనీసం 3 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉందని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకూ రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Read Latest and Viral News

Updated Date - Jan 10 , 2025 | 08:41 PM