Health: ఇతడు నెల రోజుల్లో 900 గుడ్లు తిన్నాడు! చివరకు ఏమైందంటే..
ABN, Publish Date - Feb 14 , 2025 | 06:36 PM
రోజుకు సగటున 30కి పైగా కోడి గుడ్లు తిన్న ఓ వ్యక్తి శరీరంలో మేలి మార్పులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: కోడి గుడ్లల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర ఎసెన్షియల్ అమైనోయాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే కండలు పెంచాలనుకునే వారు కోడి గుడ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే, స్టెరాయిడ్స్ వినియోగం కంటే కోడి గుడ్లతో ఎక్కువ ఫలితం ఉంటుందా అన్న సందేహం ఓ జపాన్ వ్యక్తికి కలిగింది. ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు రంగంలోకి దిగిన అతడు ఫలితం చూసి ఆశ్చర్యపోయాడు (Viral).
శరీర దారుఢ్యం ఏమాత్రం పెరుగుతుందో తెలుసుకునేందుకు అతడు రోజుకు ఏకంగా 30 గుడ్లు తినడం ప్రారంభించాడు. దీంతో, పాటు కండలు పెంచేందుకు వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్, బెంచ్ ప్రెస్ వంటివి చేయడం ప్రారంభించాడు. ఇలా సరిగ్గా నెల రోజుల పాటు చేసే సరికి ఊహించని ఫలితాలు వచ్చాయి. అతడి మజిల్ మాస్ (కండరాలు) ఏకంగా 6 కేజీలు పెరిగింది. అంతేకాకుండా, మునుపటి కంటే 20 కేజీలు అదనపు బరువు ఎత్తే సామర్థ్యం వచ్చింది.
Viral: భూటాన్‌లో భారతీయ పెట్రోల్ పంప్.. లీటర్ ఇంధనం ధర ఎంతో తెలిస్తే..
కొలెస్టరాల్ పెరుగొచ్చని మొదట్లో అతడు కంగారు పడ్డాడు. ఫలితంగా మాత్రం ఇందుకు విరుద్ధంగా వచ్చింది. అతడి ఒంట్లో చెడు కొలెస్టరాల్ పెరగకపోగా మంచి కొలెస్టరాల్ స్థాయిలు పెరిగాయి. రక్తంలో పెరిగిన ఇతర హానికారక కొవ్వులు కూడా తొలగిపోయాయి. ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గాయి. అయితే, ఇలా రోజూ గుడ్లు తెగ తినడం వల్ల కడుపులో ఇబ్బంది కూడా అనిపించిందని అతడు చెప్పుకొచ్చాడు. తొలుత పచ్చి గుడ్లు తినడంతో ఇలా అయ్యిందని భావించిన అతడు తరువాత ఉడకబెట్టిన గుడ్లకు మారడంతో అంతా మామూలైపోయిందని అన్నాడు.
ఇక ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. గుడ్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సహజసిద్ధమైన ఆహారం తినే కోళ్ల నుంచి సేకరించే గుడ్లే ఆరోగ్యానికి మంచివని అన్నారు.
ఇక కోడి గుడ్లతో ఆరోగ్యం మెరుగుపడుతుందని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సమతులాహారంలో భాగంగా గుడ్లను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అంది శరీర దారుఢ్యం పెరుగుతుందని భరోసా ఇస్తున్నారు.
Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!
Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!
Updated Date - Feb 14 , 2025 | 06:36 PM