Watch Video: కారు డిక్కీలోంచి వేలాడుతున్న చెయ్యి.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:04 PM
Watch Video: రోడ్డుపై ఇన్నోవా కారు వెళ్తోంది. దాని వెనకాలే మరో కారు వస్తోంది. ఇంతలో ఇన్నోవా కారు డిక్కీ నుంచి ఓ చేయి కందకు జారింది. అంతే.. అది చూసిన వెనుక కారులోని వ్యక్తుల గుండె గుభేల్ అంది. మరి ఆ తరువాత ఏం జరిగింది.. డిక్కీ బయటకు వచ్చిన చెయ్యి ఎవరిది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..

Viral News: ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యారంటేనే అది చూసిన వారు తీవ్రంగా కంగారుపడిపోతారు. అలాంటిది.. రన్నింగ్‌లో ఉన్న ఒక కారు డిక్కీలోంచి చేయి వేలాడుతూ కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. అది చూసిన వారి గుండె జారిపోవడం ఖాయం. అలాంటి సీన్‌కు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవును, వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై వెళ్తున్న కారులోంచి వ్యక్తి చేయి వేలాడుతూ కనిపించింది. ఈ వీడియో సోల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఇంతకీ ఈ వీడియో ఎక్కడిది.. ఏ ప్రాంతంలో దీనిని తీశారు.. ఆ తరువాత ఏం జరిగింది.. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ముంబైలోని వాషి, సన్పాడ రైల్వే స్టేషన్ మధ్య దారిలో ఓ ఇన్నోవా కారు వెళ్తోంది. ఆ కారు వెనుక డిక్కీలోంచి చెయ్యి వేలాడుతూ కనిపించింది. అది గమనించిన ఇతర వాహనదారులు దానిని తమ ఫోన్ కెమెరాలతో వీడియో తీశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో అటు ఇటు తిరిగి ముంబై పోలీసుల కంట పడింది. వెంటనే రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వీడియోలోని వాహనాన్ని ట్రాక్ చేశారు. ఈ వీడియో సోమవారం సాయంత్రం 6.45కి తీసినట్లు గుర్తించిన పోలీసులు.. అదే రోజు రాత్రి ఘట్కోపర్ సమీపంలో ఈ కారును గుర్తించారు. వెంటనే కారు వద్దకు వెళ్లారు. అక్కడ ముగ్గురు అబ్బాయిలు తమ ల్యాప్‌టాప్‌లను ప్రమోట్ చేయడానికి రీల్స్ తయారు చేయడాన్ని గమనించారు. ఆ అబ్బాయిలు మొంబై నుంచి వచ్చారని.. ఒక పెళ్లి కోసం నవీ ముంబైకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మ్యాటరేంటని ఆరా తీయగా అసలు విషయం చెప్పేశారు.
అదంతా ప్రాంక్ వీడియో అని తేల్చేశారు. అబ్బాయిలు తమ ల్యాప్‌టాప్ సేల్స్‌ని ప్రమోట్ చేసుకునేందుకు ఇలా ప్రాంక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంక్‌లో భాగంగా.. కారును ఎవరైనా ఆపి డిక్కీ చేస్తే.. వారికి కాస్త భయపెట్టి, ఆ తరువాత తమ ల్యాప్‌టాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. డిక్కీలోంచి చెయ్యి బయటకు పెట్టిన వ్యక్తి తాను చనిపోలేదని, బతికే ఉన్నానని చెప్పి.. ఆపై తమ ల్యాప్‌టాప్ గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు తమ విచారణలో నిర్ధారించుకున్నారు. అయితే, ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయనప్పటికీ.. సదరు అబ్బాయిలను పోలీసులు ఇంకా విచారిస్తున్నట్లు సమాచారం.
ముంబై వాసులను హడలెత్తించిన వీడియో ఇదే.. ఈ లింక్‌పై క్లిక్ చేసి వీడియోను చూడొచ్చు..
Also Read:
ఈ ప్రయాణం నిజంగా అవుటాఫ్ 10 బై 10
రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ
కేంద్రంతో విభేదాలు.. స్టాలిన్ మరో కీలక నిర్ణయం
For More Trending News and Telugu News..