Share News

Pig Kidney: మహిళకు పంది కిడ్నీ..130 రోజుల తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 14 , 2025 | 07:06 AM

Pig Kidney To US Woman: ఆమె కిడ్నీలు రెండు పాడవటంతో వైద్యులు ఓ ప్రయోగానికి తెరతీశారు. ఆమెకు పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆమె ఇంటికి కూడా వెళ్లిపోయింది. దాదాపు 130 రోజుల పాటు ఆమె పంది కిడ్నీతో జీవించింది. తర్వాతినుంచి అసలు సమస్య మొదలైంది.

Pig Kidney: మహిళకు పంది కిడ్నీ..130 రోజుల తర్వాత ఏం జరిగిందంటే..
Pig Kidney To US Woman

అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత మనిషి మనుగడను ఎంతో సులభతరం చేస్తోంది. ముఖ్యంగా వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న ప్రగతి.. రోగాలను రాకుండా చేయటంలో.. వచ్చిన రోగాలను ధీటుగా ఎదుర్కోవటంలో ఎంతో ఉపయోగపడుతోంది. మనిషి అవసరాన్ని బట్టి జంతువుల అవయవాలను సైతం వైద్యులు ఉపయోగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న మహిళకు వైద్యులు పంది కిడ్నీని అమర్చారు. దాదాపు ఆమె 130 రోజుల పాటు పంది కిడ్నీతో జీవించింది. అన్ని రోజులు పంది కిడ్నీతో ఉండి.. ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది.


ఇంతకీ ఆమెకు పంది కిడ్నీ ఎందుకు అమర్చారు. 130 రోజుల తర్వాత ఆమెకు ఏమైంది? అని తెలుసుకోవాలంటే.. ఈ మొత్తం స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన టోవానా లూనీ అనే 53 ఏళ్ల మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి కిడ్నీల సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం.. అంటే సరిగ్గా 130 రోజుల క్రితం ఆమెకు పంది కిడ్నీ అమర్చారు. అయితే, అది సాధారణ కిడ్నీ కాదు.. జెనటికల్లీ ఇంజనీర్డ్ పంది కిడ్నీ. కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయింది. టోవానా ఆరోగ్యం బాగా ఉండటంతో డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిపోయింది.


కొంతకాలం పాటు ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. తర్వాతి నుంచి విపరీతమైన నొప్పి మొదలైంది. ఆమె ఆ నొప్పి భరించలేకపోయింది. 130 రోజుల పాటు ఎంతో కష్టంగా కిడ్నీ నొప్పిని భరిస్తూ జీవించింది. తాజాగా డాక్టర్లు ఆమెను పరీక్షించారు. పంది కిడ్నీని ఆమె శరీరం స్వీకరించలేకపోతోందని గుర్తించారు. ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ఓ మనిషి పంది కిడ్నీతో ఇంత కాలం జీవించటం ఇదే మొదటి సారని డాక్టర్లు తేల్చారు. ఇకపై నుంచి ఆమె ప్రతీసారి డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుందని వారు అన్నారు. మహిళకు పంది కిడ్నీ అమర్చిన డాక్టర్ మాట్లాడుతూ.. ‘ మా ప్రయోగం సక్సెస్ అయింది. భవిష్యత్తులో ఇది మరింత మెరుగుపడుతుంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి
Journey Through Wounds: ఒక గాయం రంగులేసుకునే కల

Ambedkar Jayanti 2025: అంబేడ్కర్ తాత్త్వికతకు ఆనాటి కవితాభాష్యం

Updated Date - Apr 14 , 2025 | 07:06 AM