Viral: టిక్కెట్‌కు చిల్లర ఉన్నా ఇవ్వని రైల్వే ఉద్యోగి.. ప్యాసెంజర్ గుస్సా.. వీడియో వైరల్
ABN, Publish Date - Jan 19 , 2025 | 10:58 PM
టిక్కెట్ కొనేందుకు చిల్లర ఉన్నా తనకు ఇవ్వట్లేదంటూ రైల్వే కౌంటర్‌లోని ఓ వ్యక్తితో ప్యాసెంజర్ గొడవపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: డబ్బు లావాదేవీల్లో చిల్లర సమస్య తరచూ వస్తుంటుంది. పెద్ద నోటు ఇచ్చి చిల్లర డబ్బులు వెనక్క రాకపోతే అనేక మంది గొడవకు దిగుతుంటారు. తాజాగా ముంబైలోని రైల్వే స్టేషన్‌లో కూడా దాదాపు ఇలాంటి గొడవ ఒకటి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి కాందీవలీ రిటర్న్ టిక్కెట్ కోసం రూ.50లను కౌంటర్‌లోని సిబ్బందికి ఇచ్చారు. అయినా సిబ్బంది మాత్రం టిక్కెట్ డబ్బులు తిరిగిచ్చేది లేదని అన్నారు. దీంతో, ప్యాసెంజర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చిల్లర ఎందుకివ్వవని ప్రశ్నించారు (Viral).
Viral: ఇంటి ఓనర్‌కు భారీ షాకిచ్చిన పని మనిషి! ఏం జరిగిందో తెలిస్తే..
అంతేకాకుండా, తమ వాగ్వాదాన్ని తన సెల్‌ఫోన్లో రికార్డు చేయడం కూడా ప్రారంభించాడు. కానీ, కౌంటర్ లో కూర్చొన్న వ్యక్తి మాత్రం చిల్లర ఇచ్చేది లేదని నిరాకరించాడు. ఈ క్రమంలో మరో వ్యక్తి ఒకరు వచ్చి స్కాన్ చేయాలని ప్యాసెంజర్‌కు సూచించారు. కానీ, అతడు మాత్రం చిల్లర ఇవ్వాలని పట్టుబట్టాడు. వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందీ తెలియరాలేదు.
Viral: వలసపాలనపై పశ్చాత్తాపం.. భారతీయులకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్ పాప్ సింగర్
కాగా, ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రైల్వే కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తిపై అనేక మంది విమర్శలు గుప్పించార. చిల్లర ఉన్నా కూడా ప్యాసెంజర్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఇది కచ్చితంగా సేవాలోపమని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వోద్యోగులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు్న్నారని దుమ్మెత్తిపోశారు.
మరికొందరు మాత్రం సిబ్బందిని వెనకేసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పెద్ద నోట్లు పట్టుకొచ్చి చిల్లర ఇవ్వమంటే ఎలాగని ప్రశ్నించారు. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక కూడా ఇలా క్యాష్‌తో లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Viral: వామ్మో.. ఈ కోతి గాలిపటం ఎగరేయడం ఎక్కడ నేర్చుకుందో.. షాకింగ్ వీడియో
Viral: బిడ్డను కన్నందుకు పరిహారంగా భార్యకు ‘మహిళా పన్ను’ చెల్లింపు! ఇదేం తీరు దేవుడా..
Updated Date - Jan 19 , 2025 | 10:58 PM