Rohit Sharmas Lord Comment: దేవర ఉండగా ఎందుకు టెన్షన్.. శార్దూల్‌పై రోహిత్ కామెంట్

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:50 PM

ఎల్ఎస్‌జీ విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్‌ను జట్టు అధిపతి సంజీవ్ గోయెంకా ముందు రోహిత్ ఆటపట్టించే ప్రయత్నం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Rohit Sharmas Lord Comment: దేవర ఉండగా ఎందుకు టెన్షన్.. శార్దూల్‌పై రోహిత్ కామెంట్
Rohit Sharma's 'Lord' Comment on Shardul

ఇంటర్నెట్ డెస్క్: ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో ఎల్ఎస్‌జీ బౌలర్లు శార్దూ్ల్, అవేశ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఎమ్‌ఐ బ్యాటర్లు బౌండరీలు సాధించలేక చతికిల పడ్డారు. చివరకు 12 పరుగుల తేడాతో ఓటమి చవి చూశారు. ఒత్తిడిని తట్టుకుని మరీ శార్దూల్, ఆవేశ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం క్రికెట్ అభిమానులను అలరించింది. శార్దూల్ లైన్ అండ్ లెన్త్ పక్కాగా మెయింటేన్ చేయడం పరిశీలకులనే కాకుండా ప్రత్యర్థి టీమ్ మెంబర్స్‌ను కూడా మురిపించింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్‌గా మారాయి.


మ్యాచ్ ముగిసిన తరువాత ఎల్‌ఎస్‌జీ, ఎమ్‌ఐ టీమ్స్ సభ్యులు స్టేడియంలో సరదా సంభాషణలకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్ఐ బ్యాటర్ రోహిత్ శర్మ..అటుగా వచ్చిన ఎల్ఎస్‌జీ అధిపతి సంజీవ్ గోయెంకాతో మాటకలిపాడు. మీకు టెన్షన్ ఎందుకు సార్.. లార్డ్ (దేవర) ఉన్నాడుగా అని శార్దూల్‌ని చూపిస్తూ కామెంట్ చేశాడు. కాగా మ్యాచ్‌కు ముందు కూడా శార్దూల్, రోహిత్ సరదా సంభాషణ సాగింది. తనని తాను లార్డ్ అని పిలుచుకున్నందుకు శార్దూల్‌ను రోహిత్ ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, తనకు ఆపేరు ఇచ్చింది మొదట నువ్వే అంటూ రోహిత్‌ను ఉద్దేశించి శార్దూల్ అన్నాడు.


ఎమ్‌ఐతో నిన్నటి మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దూకుడు మీదున్న నమన్‌ను స్పిన్నర్ దిగ్వేష్ బౌల్డ్ చేయడం, ఆటుపై సూర్యకుమార్ యాదవ్‌ను అవేశ్ పెవిలియన్ బాట పట్టించడంతో ముంబై పతనం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా బ్యాట్‌‌తో కూడా మ్యాజిక్ చేద్దామనుకున్నా చివర్లి ఓవర్లలో శార్దూల్, అవేశ్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముంబై ఓటమిని ఖరారు చేసింది. ఇదిలా ఉంటే, బ్యాటింగ్‌లో తడబడ్డ తిలక్ రిటైర్డ్ ఔట్‌గా వైదొలగక పోయి ఉంటే ముంబై విజయావకాశాలు మెరుగై ఉండేవా అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

అదే మా కొంపముంచింది: కమిన్స్

కోల్‌కతా వైభవంగా

సూర్య ముంబై వెంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2025 | 04:55 PM