Woman's Boyfriend's Dad Is Her Ex: మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

ABN, Publish Date - Apr 07 , 2025 | 07:31 PM

తనకు కాబోయే భర్త తండ్రిని చూడగానే యువతికి భారీ షాక్ తగిలింది. ఆయనతో గతంలో డేటింగ్ చేసిన విషయం బాయ్‌ఫ్రెండ్‌తో ఎలా చెప్పాలో తెలీక దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. స్కాట్‌లాండ్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.

Woman's Boyfriend's Dad Is Her Ex: మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
Woman's Boyfriends Dad Is Her Ex

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమల్లో వయసు తారతమ్యాలను అనేక మంది పట్టించుకోవట్లేదు. తమ కంటే పెద్దవారితో కూడా లవ్‌లో పడటం, ఆ తరువాత బ్రేకప్ చెప్పడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ తీరు ఓ యువతికి ఊహించని షాకిచ్చింది. వింత సమస్యలో ఇరుక్కున్న ఆమె ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక తన సమస్యను నెట్టింట పంచుకుంది. స్కాట్‌లాండ్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ యువతికి టిండర్ ద్వారా కొన్ని నెలల క్రితం యువకుడు పరిచయమయ్యాడు. అతడి తీరు నచ్చడంతో ఆమె ప్రేమలో పడింది. డేటింగ్ దశ దాటి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో యువకుడు ఆమెను తన కుటుంబసభ్యులకు పరిచయం చేద్దామని అనుకున్నాడు. అతడితోనే తన జీవితం అని నిర్ణయించుకున్న యువతి కూడా ఇందుకు సరేనని చెప్పింది. దీంతో, ఇటీవల ఓ రోజు ఆమెను యువకుడు తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు.


కానీ యువకుడి తండ్రిని చూడానే యువతికి భారీ షాక్ తగిలింది. కారణం.. ఆమె అతడితో గతంలో డేటింగ్ చేసి ఉండటమే. కొన్ని కారణాలతో వారిద్దరూ విడిపోయారు. అతడు మళ్లీ ఇలా తన జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె నిర్ఘాంతపోయింది. బాయ్‌ఫ్రెండ్ తండ్రితోనే డేటింగ్ చేసి ఉండటంతో ఆ విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌తో ఎలా పంచుకోవాలో, తన జీవితం ఎటుపోతోందో తెలీక యువతి తలకిందులైంది. చివరకు, ఓ పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాన్ని పంచుకుంది.

బాయ్‌ఫ్రెండ్‌తో సెటిల్ అవుదామనుకుంటున్న తరుణంలో ఇలా జరగడంతో తనకు భారీ షాక్ తగిలిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌తో దాచి పెట్టి పెళ్లి చేసుకుంటే తదుపరి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేకపోతున్నానని వాపోయింది.


అలాగని, బాయ్‌ఫ్రెండ్‌కు వదులుకునేందుకు కూడా తాను సిద్ధంగా లేనని చెప్పింది. అతడు తనకు తగిన జోడు అని, తమ సంసారం సాఫీగా సాగిపోతుందన్న నమ్మకం తనకు ఉందని కూడా వ్యాఖ్యానించింది. ఈ డైలమా నుంచి బయటపడటం ఎలాగో తెలీట్లేదని వాపోయింది. అయితే, నిజం చెప్పడం మినహా మరో మార్గం లేదని అనేక మంది శ్రోతలు స్పష్టం చేశారు. ఆమె నిజంగానే వింత సమస్యలో పడిందని కొందరు నిట్టూర్చారు.

ఇవి కూడా చదవండి:

పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఏటా రూ.40 లక్షల ఆదాయం.. నెట్టింట పోస్టు వైరల్

మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని.. ఆమె తండ్రి అస్థికలు దొంగిలించి..

ఇతరులను టచ్ చేస్తే షాక్.. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా

Read Latest and Viral News

Updated Date - Apr 07 , 2025 | 07:38 PM