Share News

Employee Felt Like Toilet Paper: గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన ఆవేదన.. ఈ రాజీనామా లేఖ చూస్తే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 06:16 PM

తనను టాయిలెట్ పేపర్‌లాగా వాడుకుని విసిరిపారేశారంటూ హర్టయిన ఓ ఉద్యోగి రాజీనామా లేఖ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Employee Felt Like Toilet Paper: గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన ఆవేదన.. ఈ రాజీనామా లేఖ చూస్తే..
Employee Felt Like Toilet Paper

ఇంటర్నెట్ డెస్క్: టాలెంటున్నోళ్లకు కవాల్సిందల్లా గుర్తింపే. తమ పని గురించి ఒక చిన్న ప్రశంస.. ఒక మంచి మాట ఇలాంటి వాళ్లను సంబరపడిపోయేలా చేస్తుంది. మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. కొందరు ఉద్యోగులు కూడా గుర్తింపుకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. తమ పనికి తగ్గ గుర్తింపు దక్కుతోందంటే జీతం విషయంలో కూడా రాజీధోరణి అవలంబిస్తారు. సరిగ్గా ఇలాంటి కారెక్టర్ ఉన్న ఉద్యోగి తనకు ఎదురైన నిరాదరణ తకట్టుకోలేక రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన గుండెలోని బాధకు అక్షర రూపం ఇస్తూ ఆ వ్యక్తి టాయిలెట్ పేపర్ మీద రాసిచ్చిన లేఖ ప్రస్తుతం ట్రెండవుతోంది. సంస్థ యజమానికి కూడా ఈ లేఖ కదిలించింది.


సింగపూర్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త యాంజెలా.. ఓ ఉద్యోగి రాసిన ఈ రాజీనామా లేఖను నెట్టింట పంచుకున్నారు. సదరు ఉద్యోగి నిజాయతీ, మనసులోని ఆవేదన తనను కదిలించాయని అన్నారు. సంస్థలో పని సంస్కృతి మెరుగ్గా లేని పక్షంలో ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చెబుతూ ఈ లేఖను షేర్ చేశారు. ‘‘ఈ సంస్థలో నన్ను చెత్తలో విసిరిపారేసే టాయిలెట్ పేపర్‌లా చూశారు. అవసరమైనప్పుడు వాడుకుని తరువాత పట్టించుకోవడం మానేశారు. ఇది ఎంత బాధాకరమో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అందుకే ఇలా టాయిలెట్ పేపర్ మీద రాజీనామా లేఖ రాస్తున్నాను’’ అని సదరు ఉద్యోగి తన ఆవేదనంతా వెళ్లగక్కారు.


ఈ మాటలను తనను అమితంగా కదిలించాయని, గుండెలో ముల్లు గుచ్చుకున్నట్టు అనిపించిందని యాంజెలా అన్నారు. ఉద్యోగులను ప్రోత్సహించేలా పని వాతావరణం ఎందుకు ఉండాలో ఈ లేఖ తనకు మరోసారి గుర్తు చేసిందని అన్నారు. ‘‘మీ సంస్థలో ఉద్యోగులకు తమ ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం కలిగేలా చేయండి. సంస్థను వీడుతున్న సమయంలో కూడా వారు కృతజ్ఞతతో వెళతారు. ఈ ఘటన ఉద్యోగి నిబద్ధత కంటే కంపెనీలో నెలకొన్న విషపూరిత పని సంస్కృతికే అద్దం పడుతోంది’’ అని ఆమె కామెంట్ చేశారు, ఉద్యోగుల్లో అసంతృప్తి పొడచూపుతుంటే చిన్న ప్రశంస కూడా భారీ సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతూ తన పోస్టు ముగించారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

అంతరిక్ష యాత్రలకు ఖర్చు ఎంత.. ఉచితంగా కూడా వెళ్లి రావొచ్చని తెలుసా

ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..

వృద్ధుడిని చీదరించుకుంటున్న జనం.. ఇతడు ఏం చేశాడో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Apr 15 , 2025 | 06:21 PM