Viral Video: ఇది మామూలు ఫైట్ కాదు.. పాము-ముంగిస పోరాటం చూశారా? చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:30 PM
మనుషులే కాదు.. క్రూర మృగాలు కూడా సాధారణంగా పాముల జోలికి వెళ్లవు. పాము కాటేసిందంటే ఆ విషం ప్రాణాలను తీసేస్తుంది. అంతలా అందర్నీ భయపెట్టే పాములను ముంగిసలు భయపెడతాయి. పాము-ముంగిసల వైరం గురించి అందరికీ తెలిసిందే.
సాధారణంగా పాములంటే (Snakes) అందరూ భయపడతారు. మనుషులే కాదు.. క్రూర మృగాలు కూడా సాధారణంగా పాముల జోలికి వెళ్లవు. పాము కాటేసిందంటే ఆ విషం ప్రాణాలను తీసేస్తుంది. అంతలా అందర్నీ భయపెట్టే పాములను ముంగిసలు (Mongoose) భయపెడతాయి. పాము-ముంగిసల వైరం గురించి అందరికీ తెలిసిందే. పాము కనిపిస్తే చాలు ముంగిస దాడికి దిగుతుంది. ముంగిస నుంచి తప్పించుకునేందుకు పాములు పరుగులు పెడతాయి. సాధారణంగా ముంగిస-పాము మధ్య పోరాటంలే పాములే ఎక్కువసార్లు ప్రాణాలు కోల్పోతాయి (Snake fight with mongoose). ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పామును ముంగిస వెంటాడింది (Viral Video).
asmanjan_rj_11 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు దాటి వెళ్తున్న ఓ పామును చూసిన ముంగిస వెంటబడింది. పాము తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన శక్తినంతా ఉపయోగించి పరుగులు పెడుతోంది. అయినా ముంగిస మాత్రం దానిని వదల్లేదు. ముంగిస నుంచి తప్పించుకోవడానికి పాము పలుసార్లు గాల్లోకి ఎగిరింది. అయినా ముంగిస తన నోటితో పామును కొరికింది. కొద్ది సేపు నేల మీద అచేతనంగా ఉండిపోయిన పాము తర్వాత ఓ పుట్టలోకి ప్రవేశించింది. పామును వెంబడిస్తూ ముంగిస కూడా ఆ పుట్టలోకి ప్రవేశించింది. అక్కడితో వీడియో ముగిసింది.
ఆ పాము, ముంగిసల పోరాటాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. 11 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ రెండు బద్ధ శత్రువులు``, ``చివరకు ఏం జరిగింది``, ``చాలా గొప్ప పోరాటం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు.. లాస్ట్ ఫుడ్.. కోకా-కోలాతో ఎగ్ బుర్జి ఎలా చేస్తున్నాడో చూడండి..
Viral Video: తమ్ముడూ.. చలి కాదు, తేడా వస్తే ప్రాణాలే పోతాయ్.. వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన..
Electricity Bill: కరెంట్ బిల్లు చూసి షాక్.. ఏకంగా రూ.200 కోట్లు రావడంతో యజమాని పరిస్థితి ఏంటంటే..
Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి