Share News

Man Steals Ex's Chicken: మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోడిని ఎత్తుకెళ్లి.. పోలీసులు వచ్చేసరికి వలవలా ఏడుస్తూ..

ABN , Publish Date - Apr 05 , 2025 | 09:30 PM

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోడిని దొంగిలించి వెక్కివెక్కి ఏడుస్తున్న యువకుడికి పోలీసులు అరెస్టు చేసిన ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో తెగ వైరల్ అవుతోంది.

Man Steals Ex's Chicken: మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోడిని ఎత్తుకెళ్లి.. పోలీసులు వచ్చేసరికి వలవలా ఏడుస్తూ..
Man Steals Ex's Chicken

ఇంటర్నెట్ డెస్క్: బ్రేకప్‌ను భరించడం కష్టమే. ప్రేమించిన వారు దూరమవడాన్ని చాలా మంది తట్టుకోలేరు. మరికొందరు మాత్రం ఉక్కపోత వదిలిపోయిందంటూ పార్టీలు చేసుకుంటారు. ఈ క్రమంలో మాజీల వద్ద ఉన్న తమ వస్తువులన్నీ వెనక్కు తెచ్చుకుంటారు. అయితే, అమెరికాకు చెందని ఓ వ్యక్తి చేసిన పని మాత్రం జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. కారణం అతడు ఓ కోడిని దొంగిలించడమే.

వాషింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన పెంపుడు కోడి పాలీని మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎత్తికెళ్లిపోయాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాకు పాలీ దొరికింది అంటూ పలుమార్లు అరిచాడని కూడా చెప్పింది. ఇక నిందితుడేమో కోడితో పాటు సమీపంలోని అడవిలోకి వెళ్లి దాక్కున్నాడు. ఈలోపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అతడు ఎక్కడ దాక్కున్నదీ సులువుగానే గుర్తించి బయటకు రమ్మని ఆదేశించారు.


పోలీసులు రాగానే ఆ యువకుడు ఏడుపు మొదలెట్టాడు. నా పాలీని ఏమీ చేయొద్దని పోలీసులను అర్థించాడు. ఇది విని కాస్త షాకయిన పోలీసులు.. పాలీకి ఏ సమస్యా రాదని భరోసా ఇచ్చారు. రెండు చేతులూ తమకు చూపిస్తూ బయటకు రావాలని ఆదేశించారు.

ఈ క్రమంలో పోలీసుల ముందుకొచ్చిన అతడు కన్నీటి పర్యంతమవుతూనే ఉన్నాడు. నా కోడిని ఏమీ చేయొద్దని కాళ్లావేళ్లా పడ్డాడు. దీంతో, పోలీసులు అతడిని మళ్లీ సముదాయించే ప్రయత్నం చేశారు. కోడిని అతడి దగ్గరే పెట్టుకోమని ఊరడించాక మెల్లగా బేడీలు వేసి అరెస్టు చేశారు. అయితే, కోడిని దాని యజమానికి అప్పుజెబుతామని స్పష్టం చేశారు. నిందితుడిపై చోరీ కేసు పెట్టినట్టు తెలిపారు.


ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పాపం.. అతడికి ఆ కోడి అంటే ప్రాణం కాబోలు అని కొందరు విచారం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి మీరూ దీనిపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి:

దేవుడా..ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా.. ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే..

దేవర ఉండగా ఎందుకు టెన్షన్.. శార్దూల్‌పై రోహిత్ కామెంట్

అత్తపై కోడలి పైశాచికత్వం.. వృద్ధురాలని కూడా చూడకుండా జుట్టుపై నేలపై ఈడుస్తూ..

Read Latest and Viral News

Updated Date - Apr 05 , 2025 | 09:34 PM