Noida Hotel Case: ఇద్దరూ ఏకాంతంగా గడిపారు.. యువతి బాత్ రూమ్ నుంచి వచ్చే సరికే..
ABN , Publish Date - Apr 12 , 2025 | 07:55 PM
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌కు చెందిన ఉమేశ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నోయిడాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మధురకు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పీకల్లోతు మునిగిపోయారు.

ఉత్తర్ ప్రదేశ్: ఓ యువతి, యువకుడు ఏకాంతంగా గడిపేందుకు నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. అక్కడికి చేరుకుని కాసేపు ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత సదరు యువతి బాత్ రూమ్‌కి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఘటన చూసి నిర్ఘాంతపోయింది. అప్పటివరకూ సరదాగా గడిపిన వ్యక్తి అలా అయిపోవడంతో బెంబేలెత్తింది. అక్కడికి వచ్చిన హోటల్ సిబ్బంది సైతం యువకుడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. తమ హోటల్‌లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదంటూ వాపోయారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌కు చెందిన ఉమేశ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నోయిడాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మధురకు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పీకల్లోతు మునిగిపోయారు. అయితే వారిద్దరూ ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకుని నోయిడా సెక్టార్ 27లోని ఓ హెటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ రూమ్ తీసుకుని చెక్ ఇన్ అయ్యారు. వారి వెంట కుక్కపిల్లను సైతం తీసుకెళ్లారు. కాసేపు ఆనందంగా గడిపిన తర్వాత యువతి స్నానం చేసేందుకు బాత్ రూమ్‌కి వెళ్లింది. తిరిగి బయటకు వచ్చే సరికే ఉమేశ్‌ను చూసి షాక్ అయ్యింది.
సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న ఉమేశ్‌ను చూసే సరికే యువతికి కాళ్లు, చేతులు వణికిపోయాయి. భయంతో వెంటనే కేకలు వేయడం ప్రారంభించింది. అక్కడికి చేరుకున్న హోటల్ సిబ్బంది సైతం యువకుడిని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అలాగే నోయిడాలోని కొత్వాలి సెక్టార్-20 పోలీస్ స్టేషన్‌కు యువతిని తీసుకెళ్లి విచారిస్తున్నారు. అసలేం జరిగిందో కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలు గుర్తించారు. యువతి స్నానానికి వెళ్లే ముందు వారిద్దరికీ పెద్ద గొడవ జరిగినట్లు తెలుసుకున్నారు. మరోవైపు ఉమేశ్‍కు గతంలోనే వివాహం అయ్యిందని, వారి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నట్లు చెప్పారు. భార్యతో వచ్చిన మనస్పర్థలు కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రియురాలితో గొడవ కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..
Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..
Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..