ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: డాక్టర్లు కడుపులో సూది వదిలిపెట్టడంతో గర్భస్థ శిశువుకు గాయాలు.. బాధితురాలి సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Jan 06 , 2025 | 11:41 PM

మహిళ మొదటి ప్రసవం సందర్భంగా జరిగిన ఓ పొరపాటు రెండో ప్రసవంలో గర్భస్థ శిశువుకు ప్రాణసంకటంగా మారింది. తల్లిగర్భంలో ఉండిపోయిన సూది కారణంగా గర్భస్థ శిశువుకు గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. మొదటి ప్రసవం సందర్భంగా డాక్టర్లు పొరపాటున తన కడుపులో సర్జికల్ సూది వదిలేశారని చెప్పింది. దాని ఫలితంగా రెండో సారి గర్భం దాల్చినప్పుడు కడుపులో పిండానికి సూది వల్ల గాయాలయ్యాయని ఆరోపించింది. రేవాలో ఈ ఘటన వెలుగు చూసింది (Viral).

స్థానిక మీడియా కథనాల ప్రకారం, నగరంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి హీనా ఖాన్. ఆమె రెవాలోని ఘోఘార్ ప్రాంతంలో ఉంటారు. అయితే, పెళ్లి తరువాత తొలిసారి గర్భం దాల్చిన ఆమెకు 2023 మార్చి 5న సంజయ్ గాంధీ ఆసుపత్రిలో డెలివరీ చేశారు. ఆ తరువాత తల్లీ, పిల్లా ఆరోగ్యంగా ఉండటంతో కొన్ని రోజులకు డిశ్చార్జ్ చేశారు.

Viral: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. కలోనిజమో తెలీక బాధితుడికి షాక్!


ఇంటికొచ్చాక కూడా మహిళ కడుపులో ఇబ్బందిగా ఉండటంతో వైద్యులను సంప్రదించారు. ప్రసవం సందర్భంగా వేసి కుట్ల కారణంగా ఇబ్బంది తలెత్తినట్టు వైద్యులు చెప్పి పంపించారు. ఈ క్రమంలో హీనా ఖాన్ మరోసారి గర్భం దాల్చింది.

ప్రసవం కోసం జిల్లా ఆసుపత్రిలో చేరగా అక్కడి వైద్యులు ఆమె కడుపులో ఉన్న సర్జికల్ సూదిని గుర్తించారు. మహిళ రెండోసారి గర్భం దాల్చాక కడుపులో నొప్పి ఈ సూది కారణమని తేలింది. ఈ క్రమంలో సూది కారణంగా గర్భస్థ శిశువుకు కూడా గాయాలైనట్టు తేలింది. దీంతో, డెలివరీ తరువాత బిడ్డను వెంటిలేటర్‌పై పెట్టారని బాధిత మహిళ కుటుంబం పేర్కొంది. అయితే, మహిళ మాత్రం ఆరోగ్యంగా ఉండటంతో బాధిత కుటుంబానికి స్వల్ప ఊరట దక్కింది.

Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..


నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఆపరేషన్ల సందర్భంగా అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తప్పుడు అనస్థీషియా డోసులు ఇవ్వడం, తప్పుడు ప్రాంతాల్లో గాట్లు పెట్టడంతో జరిగే రక్తస్రావం, నోటి ద్వారా మందులు విషయంలో పొరపాట్లు, పేషెంట్ల శరీరంలో కాటన్, లేదా ఇతర సర్జికల్ వస్తువులు వదిలిపెట్టడం వంటివి జరిగేందుకు అవకాశం ఉంది. వైద్యుల మధ్య సమాచార లోపం, ఆపరేషన్‌కు సర్జన్ సరిగా సిద్ధం కాకపోవడం లేదా నైపుణ్యం లేకపోవడం, అలసిపోయి ఉండటం వంటి కారణాలతో ఈ పొరపాట్లు దొర్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Viral: దేశసంపదలో 18 శాతం 2 వేల కుటుంబాల చేతుల్లోనే! బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ పోస్టు వైరల్

Read Latest and Viral News

Updated Date - Jan 06 , 2025 | 11:47 PM