Train Viral Video: ఇదెక్కడి వింత రైలు.. రోడ్డు మీద నడస్తున్న ఈ విచిత్రాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:47 PM
రోడ్ల మీద ప్రయాణించే విచిత్ర వాహనాలను చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి అందర్నీ ఆకట్టుకుంటూ వైలర్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని విచిత్రంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రోడ్ల మీద ప్రయాణించే విచిత్ర వాహనాలను చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
@theonly_nitish అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు మీద అతి పొడవైన రైలు (Train on the road) లాంటి వాహనం కదులుతోంది. నిజానికి అది రైలు కాదు. అవన్నీ పదుల సంఖ్యలో తోపుడు బళ్లు. లగేజ్‌తో ప్యాక్ చేసి ఉన్న తోపుడు బళ్లు అన్నింటినీ కలిపి వరుసగా కట్టేశారు. వాటన్నింటినీ ఓ ట్రాక్టర్ ఇంజన్‌కు కట్టారు. ఆ ఇంజన్ ముందుకు వెళుతూ ఈ బళ్లను లాక్కొని వెళుతోంది. అది అచ్చం చూడడానికి రైలు రోడ్డు మీద వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఆ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఈ విచిత్ర రైలును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను తక్కువ సమయంలోనే 58 వేల మందికి పైగా వీక్షించారు. 15 వందల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ``దీనిని చూసి భారతీయ రైల్వే భయపడుతోంది``, ``ఈ రైలుకు పట్టాలు అవసరం లేదు``, ``ఇది లో బడ్జెట్ గూడ్స్ రైలు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Bride Viral Video: పెళ్లిలో అందరి ముందు ఆ ప్రశ్న అడిగిన వధువు.. వరుడు చేతిలో జోడించి ఏం చెప్పాడంటే..
Wife and Husband: అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు చూస్తే..
Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి