Share News

IndiGo Flight Delay: కనీసం నిజాయితీగా అన్నా ఉండాలి కదా.. ఇండిగో, ఎయిర్ ఇండియాలపై టెకీ ఆగ్రహం

ABN , Publish Date - Apr 15 , 2025 | 08:40 PM

ఇండిగో విమానం ఆలస్యంగా ఢిల్లీకి చేరడంతో కోపెన్‌హేగన్‌కు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యానంటూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

IndiGo Flight Delay: కనీసం నిజాయితీగా అన్నా ఉండాలి కదా.. ఇండిగో, ఎయిర్ ఇండియాలపై టెకీ ఆగ్రహం
IndiGo Flight Delay

ఇంటర్నెట్ డెస్క్: విమానాలు అప్పుడప్పుడూ ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరడం సాధారణమే. అయితే, ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువైపోతున్నాయి. అనేక మంది ఎయిర్‌లైన్స్ సంస్థలపై నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్వీడెన్‌కు చెందిన ఓ భారత సంతతి టెకీ ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు..

భారత సంతతికి చెందిన స్వీడెన్ టెకీ ముహమ్మద్ అల్‌జఫర్ జియా ఈ పోస్టు పెట్టారు. ఇండిగో విమానం ఆలస్యం కావడంతో తాను ఢిల్లీ నుంచి కోపెన్‌హేగన్‌కు వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్టైట్ కూడా మిస్సయినట్టు తెలిపారు.

‘‘ఈ రెండు సంస్థలు నాకు టోపీ పెట్టాయి. రాంచీ నుంచి ఢిల్లీకి ఓ టిక్కెట్ బుక్ చేసుకున్నాను. అక్కడి నుంచి కోపెన్‌హేగన్‌కు ఎయిర్ ఇండియా కనెక్టింగ్ ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నాను. అయితే, ఇండిగో ఢిల్లీకి దాదాపు 2 గంటల ఆలస్యంగా చేరుకుంది. దీంతో, కోపెన్‌హేగన్‌కు వెళుతున్న విమానం మిస్సయ్యాను. దీంతో, మరో టిక్కెట్ బుక్ చేసుకునేందుకు, హోటల్, ఖర్చులు వంటివన్నీ కలిపి మరో రూ.50 వేలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది’’ అని అతడు వాపోయాడు.


ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సిబ్బందిని సాయం కోరినా ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడి ఇండిగో మేనేజర్‌ తనతో దురుసుగా మాట్లాడారని అన్నారు. దీనికి తాము ఎటువంటి బాధ్యత వహించమని అన్నారు. కావాలంటే విషయాన్ని ఎస్కలేట్ చేసేందుకు మరో ఈమెయిల్ ఐడీ ఇచ్చి లేఖ రాసుకోవాలని చెప్పినట్టు తెలిపారు. ఆ తరువాత అక్కడి నుంచి కూడా తనకు నిబద్ధత లేని జవాబు వచ్చిందని అన్నారు. ‘‘ప్యాసెంజర్ ఐదు నిమిషాలు లేటుగా వస్తే విమానం తలుపులు మూసేస్తారు. కానీ విమానం రెండు గంటలు ఆలస్యమైతే మాత్రం పైసా కూడా పరిహారంగా చెల్లించరు. కనీసం నిజాయతీ ఉండాలిగా’’ అని అన్నారు. రెండు ఎయిర్‌లైన్స్‌ తనకు సహకరించలేదని తెలిపారు.


ఈ పోస్టుకు ఇండిగో స్పందించింది. తమకు కొంత సమయం ఇస్తే అసలేం జరిగిందో తెలుసుకుంటామని అన్నారు. అయితే, ఈ ఉదంతంపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన ఆవేదన.. ఈ రాజీనామా లేఖ చూస్తే..

అంతరిక్ష యాత్రలకు ఖర్చు ఎంత.. ఉచితంగా కూడా వెళ్లి రావొచ్చని తెలుసా

ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..

Read Latest and Viral News

Updated Date - Apr 15 , 2025 | 10:24 PM