Share News

Restaurant Discount for Skinny People: బక్కగా ఉన్నోళ్లకు స్పెషల్ డిస్కౌంట్.. రెస్టారెంట్‌పై విమర్శలు

ABN , Publish Date - Apr 08 , 2025 | 10:10 PM

బక్కగా ఉన్న వాళ్లకు స్పెషల్ డిస్కౌంట్ అంటూ ఓ థాయ్‌లాండ్ రెస్టారెంట్ ఇచ్చిన ప్రకటన విమర్శలకు దారి తీస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు చేసిన ఈ ప్రయత్నం మంచి అభిరుచితో కూడుకున్నది కాదని జనాలు మండిపడుతున్నారు.

Restaurant Discount for Skinny People: బక్కగా ఉన్నోళ్లకు స్పెషల్ డిస్కౌంట్.. రెస్టారెంట్‌పై విమర్శలు
Thailand Restaurant Discount for Skinny People

ఇంటర్నెట్ డెస్క్: సంస్థలు ఏవైనా కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. కొత్త కొత్త ఆఫర్‌లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈ ప్రయత్నాలు ఒక్కోసారి వికటిస్తాయి. అనుకున్న ప్రయోజనానికి బదులు విమర్శలు వెల్లువెత్తుతాయి. థాయ్‌లాండ్‌లోని ఓ రెస్టారెంట్ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. డిస్కౌంట్‌లతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు సదరు రెస్టారెంట్ చేసిన ప్రయత్నం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

చియాంగ్‌మాయి బ్రేక్ ఫాస్ట్ వరల్డ్ ఈ వింత ఆఫర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం, కస్టమర్లు ఎంత బక్కగా ఉంటే అంత ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేస్తామని పేర్కొంది. ఈ డిస్కౌంట్ కావాలనుకున్న వాళ్లు సంస్థ ఏర్పాటు చేసిన గ్రిల్స్ మధ్య నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.


వివిధ సైజుల వారు పట్టేందుకు గ్రిల్స్‌లోని ఇనుప రాడ్ల మధ్య ఎడం వివిధ రకాలుగా ఏర్పాటు చేసింది. బక్కగా ఉన్న వారు మాత్రమే పట్టేంత సన్నగా ఉన్న గ్రిల్స్ మధ్య నుంచి వెళ్లగలిగితే 20 శాతం డిస్కౌంట్. గ్రిల్స్ మధ్య ఎడం పెరిగే కొద్దీ డిస్కౌంట్ కూడా తగ్గుతుంది. భారీ కాయులకు అసలే డిస్కౌంట్ ఉండదన్నమాట.

ఇక కొందరు కస్టమర్లు మాత్రం ఈ ఆఫర్‌ను సరదాగా స్వీకరించారు. గ్రిల్స్ మధ్య నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. జనాలు ఈ ఆఫర్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని వీడియోల్లో కనిపించింది.


ఈ ఉదంతం నెట్టింట కాలుపెట్టడంతో జనాలు విమర్శలు గుప్పించారు. లావుగా ఉన్న వారిని గేలి చేయాలనే దురుద్దేశంతో సంస్థ ఈ ఆఫర్ ప్రకటించిందని తిట్టిపోశారు. ఇది చాలా అవమానకరమని, ఇలాంటి చర్యలను అస్సలు సహించకూడదని అన్నారు. మరి నెటిజన్లతో ఇంతగా గగ్గోలు పెట్టిస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి:

మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

Read Latest and Viral News

Updated Date - Apr 08 , 2025 | 10:23 PM