ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వీసమెత్తు పనిచేయకుండా లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి! ఇతడి బిజినెస్ ఎంటో తెలిస్తే..

ABN, Publish Date - Jan 10 , 2025 | 09:04 PM

ఏ పనీ చేయకుండా కేవలం జనాలకు కంపెనీ ఇస్తూ లక్షలు ఆర్జిస్తున్న ఓ జపాన్ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇలాంటి వారి అవసరం కూడా జనాలకు ఉందా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: నిరంతరం శ్రమించినా కొందరికీ పూట గడిచేంత డబ్బు రాదు. అలాంటిది ఓ వ్యక్తి ఏ పనీ చేయకుండానే లక్షలు సంపాదిస్తున్నాడు. జపాన్‌కు చెందిన ఈ యువకుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారిన ఈ వ్యక్తి పేరు షోజీ మోరిమోటో. అతడిని పనిలో పెట్టుకునే అనేక మంది ఊరికే తమ వెంట ఉన్నందుకు భారీగా డబ్బు ఇస్తున్నారు. ఏ పనీ చేయకుండా కేవలం తమ వెంట కంపెనీగా ఉన్నందుకు మూడు గంటలకు రూ.6 వేల చొప్పున చెల్లిస్తుంటారు. దీంతో, గతేడాది షోజీ సంపాదన ఏకంగా రూ.69 లక్షలకు చేరుకుంది. తమ వెంట ఉండాలంటూ ఏటా తనకు వెయ్యికి పైగా విజ్ఞప్తులు వస్తుంటాయని అతడు చెప్పుకొచ్చాడు (Viral).

Viral: షాకింగ్.. రష్యన్ భార్యతో ఇండియాలో పర్యటిస్తుంటే..


రకరకాల వింత కారణాలతో తనను పిలుస్తుంటారని షోజీ వివరించాడు. ఓ వ్యక్తి తన ఇల్లు శుభ్రం చేసుకునే సందర్భంలో పిలిపించుకున్నాడని, ఆ సమయంలో అతడి వీడియో కాల్‌లో తాను కూర్చొంటే, అతడేమో ఇల్లు శుభ్రం చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఓ సారి ఓ మహిళ తనకు డైవర్స్ ఇచ్చే సమయంలో తనను పిలిపించుకుందని చెప్పాడు. ఓ రెస్టారెంట్‌లో ఆ దంపతులు మాట్లాడుకునేందుకు వచ్చారని, తానేమో ఆమెకు ఎదురుగా కొంత దూరంలో ఉన్న టేబుల్ వద్ద కూర్చొన్నట్టు చెప్పుకొచ్చాడు.

Viral: ఎమ్‌బీయే చేశాక జొమాటోలో జాబ్ ఆఫర్ వస్తే సంతోషపడ్డాడు! శాలరీ ఎంతో తెలిశాక..


కాసేపు వారు చర్చించుకున్నాక, భర్త విడాకుల పత్రాలపై సంతకాలు చేసి వెళ్లిపోయాడని తెలిపాడు. ఆ సమయంలో వారి మధ్య గొడవ ఏమీ లేకపోయినప్పటికీ తాను ఎదురుగా ఉండటం మహిళకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉండొచ్చని అన్నాడు. తనను పలిపించుకునే వారు తాను వారితో మాట్లాడాలని కూడా కోరుకోరని, తమ సమక్షంలో ఉంటే చాలన్నట్టు వారి ప్రవర్తన ఉంటుందని తెలిపాడు.

కొత్త ఏడాదిలో తాను మరో నిర్ణయం తీసుకున్నట్టు కూడా అతడు చెప్పుకొచ్చాడు. ఇకపై తనను సంప్రదించేవారి నుంచి ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయనని అన్నాడు. వారు మెచ్చి ఇచ్చింది మాత్రమే తీసుకుంటానని తెలిపాడు. ఈ విధానం తనకు లాభదాయకమూ కాదో భవిష్యత్తులో తెలుస్తుందని వ్యా్ఖ్యానించాడు.

Viral: కలలో కనిపించిన సంఖ్య ప్రకారం లాటరీ టిక్కెట్టు కొన్న మహిళ.. చివరకు ఊహించని విధంగా..

Read Latest and Viral News

Updated Date - Jan 10 , 2025 | 09:06 PM