Shocking Viral Video: బాబూ.. నీకు ప్రాణాలంటే లెక్క లేదా.. ఈ కుర్రాడు ట్రైన్ ఎలా దిగాడో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:23 PM
కొంత మంది బస్సులు, రైళ్లకు వేలాడుతూ ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే అవి పూర్తిగా ఆగకుండానే దిగిపోవాలనే తొందరలో సాహసాలు చేస్తుంటారు. ముఖ్యంగా కుర్రాళ్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే తొందర బయటపడాలని పిచ్చి పనులు చేస్తుంటారు.

కొందరు వ్యక్తులు ప్రయాణ సమయంలో తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. బస్సులు, రైళ్లకు వేలాడుతూ ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే అవి పూర్తిగా ఆగకుండానే దిగిపోవాలనే తొందరలో సాహసాలు చేస్తుంటారు. ముఖ్యంగా కుర్రాళ్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే తొందర బయటపడాలని పిచ్చి పనులు చేస్తుంటారు. ఆ క్రమంలో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చేస్తే షాకవ్వాల్సిందే (Viral Video).
@TheDogeVampire అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రైలు (Train) స్టేషన్‌కు సమీపించి నెమ్మదిగా నడుస్తోంది. రైలు పూర్తిగా ఆగకుండానే లోపల ఉన్న వారు కిందకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కిందన ఉన్న వారు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఓ కుర్రాడు రెండు భోగీల మధ్యన నడుస్తూ అకస్మాత్తుగా బయటకు వచ్చాడు. అతడిని చూస్తే ఎలా వచ్చాడనే విషయం అంత సులభంగా అర్థం కాదు. ఆ కుర్రాడు రెండు భోగీల మధ్యన ఉన్న గ్యాప్ నుంచి కిందకు దిగేశాడు. రైలు పూర్తిగా ఆగకపోవడంతో ఆ భోగీల మధ్యనే నడుచుకుంటూ బయటపడ్డాడు.
అక్కడ ఏ మాత్రం రైలు స్పీడ్ అందుకున్నా ఆ కుర్రాడు ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఆ కుర్రాడి సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 26 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాదాపు 9 వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ కుర్రాడు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు``, ``అతడికి ప్రాణాలతో పని లేదు``, ``ఇలా కూడా ట్రైన్ దిగుతారా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..
Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
Optical Illusion: ఈ ఫొటోలో మీకు గుర్రం కనబడితే.. మీరు సాధారణమైన వ్యక్తి కాదు.. ప్రయత్నించండి..
Online order: రూ.61 వేల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..