Tips For Elderly Flight Journey: విమాన ప్రయాణాలు సౌకర్యంగా ఉండేందుకు వృద్ధులు పాటించాల్సిన టిప్స్
ABN , Publish Date - Apr 14 , 2025 | 09:45 PM
విమాన ప్రయాణాలు సాఫీగా సాగిపోవాలంటే వృద్ధులు కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: వృద్ధులకు విమానప్రయాణాల సందర్భాల్లో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విమానాల కోసం సుదీర్ఘ సమయాలు వేచి చూడటం. సీట్లల్లో ఇరుక్కుని కూర్చోవడం, డీహైడ్రేషన్, విమానం క్యాబిన్‌లో ప్రెజర్‌లో మార్పులు, గంటల తరబడి సీట్లల్లోనే కూర్చుని ప్రయాణాలు చేయాల్సి రావడం వంటివన్నీ ఇబ్బందులు కలిగిస్తాయి. ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే వృద్ధులు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
వెళ్లాల్సిన చోటకు నాన్ స్టాప్ విమానాలు ఉన్నాయేమో చూడాలి. వీలైనంత వరకూ వీటిల్లోనే ప్రయాణించాలి. మార్గమధ్యంలో వివిధ ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి ఆగకుండా ఉండటం వృద్ధులకు ఇబ్బంది ఉండదు.
వీలై చెయిర్, ప్రయారిటీ బోర్డింగ్ వంటి సౌకర్యాలను ముందుగానే ఎయిర్ లైన్స్ సంస్థలు అడిగి బుక్ చేసుకోవాలి. దీంతో, బోర్డింగ్ చేసేటప్పుడు సమయం వృథా కాకుండా ఉంటుంది.
ప్రయాణాల సందర్భాల్లో వృద్ధులు తమకు కావాల్సిన మందులు, గుర్తింపు పత్రాలు, ఇతర ముఖ్యమైన పత్రాలను తమ వెంటే పెట్టుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఎవరిని సంప్రదించాలి, వారి ఫోన్ నెంబర్లు కూడా రెడీ చేసుకోవాలి.
విమానాల్లో నడిచే దారికి పక్కనే ఉన్న సీట్లనే బుక్ చేసుకోవాలి. దీంతో, అవసరమైనప్పుడు వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లే అవకాశం చిక్కుతుంది.
ప్రయాణాల సమయంలో నీరు తరచూ తాగాలి. దీంతో, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. కెఫీన్, ఆల్కాహాల్‌కు కూడా దూరంగా ఉంటే మంచిది.
ప్రయాణాలకు అనుకూలంగా వదులుగా ఉండే మెత్తని దుస్తులు ధరించాలి. సౌకర్యవంతమైన షూస్ కూడా ఎంచుకోవాలి. కంప్రెషన్ సాక్స్ వేసుకుంటే కాళ్లల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది.
సీట్లల్లో కూర్చుని చేసేందుకు వీలైన ఎక్సర్‌సైజులను చేయాలి. మడమలు తిప్పడం, భుజాలను కదిలించడం వంటివి వృద్ధుల్లో అసౌకర్యాన్ని కొంత వరకూ తగ్గిస్తాయి.
మెడికల్ ఎమర్జెన్సీ సందర్భాల్లో అక్కరకు వచ్చే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కచ్చితంగా ఉండాలి. అప్పుడే ప్రశాంతంగా జర్నీ చేయగలుగుతారు. ఆహారం కూడా సింపుల్‌గా ఉంటే ప్రయాణ సందర్భాల్లో జిర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
తెలంగాణలో పుట్టిన నీలి వజ్రం.. త్వరలో వేలం.. ధర ఎంతో తెలిస్తే..
యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై
సైబర్ నేరగాళ్లను ఎలా బురిడీ కొట్టించాలో ఈ బాలికను చూసి నేర్చుకోవాలి