Optical illusion: మీ దృష్టిలో ఎలాంటి లోపాలూ లేవా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న నిచ్చెనను 10 సెకన్లలో కనుక్కోండి మరి..
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:47 PM
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు నిత్యం అనేకం వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని ఫొటోలు ఆసక్తితో పాటూ పరిష్కరించలేని ఫజిల్స్‌గా మారుతుంటాయి. అయితే చాలా మంది ఇలాంటి ఫజిల్స్‌కు సమాధానాలు తెలుసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనలో..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు నిత్యం అనేకం వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని ఫొటోలు ఆసక్తితో పాటూ పరిష్కరించలేని ఫజిల్స్‌గా మారుతుంటాయి. అయితే చాలా మంది ఇలాంటి ఫజిల్స్‌కు సమాధానాలు తెలుసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనలో మేథోశక్తి పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. తాజాగా, మీ కోసం ఇలాంటి ఆసక్తికరమైన ఫజిల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కున్న నిచ్చెనను 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పిల్లలకు ఓ ఉపాధ్యాయుడు బొమ్మల పుస్తకాలు చూపించి పాఠాలు బోధిస్తుంటాడు. అలాగే ఆ పక్కనే ఇద్దరు పిల్లలు కంప్యూటర్‌లో పని చేస్తుంటారు. అదే విధంగా కొంచెం పక్కన ఓ పిల్లాడు అక్కడున్న టీచర్‌కు పుస్తకం చూపిస్తుంటాడు.
వారికి అటు పక్కగా ఓ బాలిక పుస్తం పట్టుకుని లోపలికి వస్తుంటుంది. ఆ గదిలో గోడల వద్ద ఏర్పాటు చేసిన ర్యాక్స్‌పై పుస్తకాలు ప్రదర్శనగా ఉంచారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా (Hidden ladder) ఓ నిచ్చెన దాగి ఉంది. దాన్ని గుర్తించడం అంత సులభం కాదు. అయితే కాస్త నిశితంగా పరిశీలిస్తే పెద్ద కష్టం కూడా కాదు.
చాలా మంది ఆ నిచ్చెనను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే కనుక్కోగలుగుతున్నారు. మీకు 10 సెకన్ల సమయం ఇస్తున్నాం. ఈలోగా ఆ నిచ్చెనను కనుక్కున్నారంటే.. మీలో పరిశీలనా శక్తి అద్భుతంగా ఉన్నట్లు అర్థం. మీ టైం స్టార్ అయింది. ఆ నిచ్చెన ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నించండి.
Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..
ఏంటీ.. ఎంత ప్రయత్నించినా కనుక్కోలేకపోతున్నారా.. అయితే ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 12 , 2025 | 01:47 PM