Viral: రైలు పట్టాలు దాటేటప్పుడు ఇలాంటి పొరపాటు మాత్రం చేయొద్దు.. భయానక సన్నివేశం!

ABN, Publish Date - Feb 14 , 2025 | 08:15 PM

రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు మూసుకుపోవడంతో పట్టాలపై ఇరుక్కుపోయిన ఓ ఎస్‌యూవీని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలుకు లక్ష డాలర్ల మేర నష్టం వాటిల్లగా కారు తునాతునకలైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: రైలు పట్టాలు దాటేటప్పుడు ఇలాంటి పొరపాటు మాత్రం చేయొద్దు.. భయానక సన్నివేశం!

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు రోడ్ల కూడళ్లు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద కొందరు పొరపాటున లేదా గ్రహపాటున అనవసర హడావుడి ప్రదర్శించి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. అమెరికాలో ఓ వ్యక్తి సరిగ్గా ఇదే చేశాడు. చివరి నిమిషంలో తెలివి పనిచేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి జనాలు షాకైపోతున్నారు (Viral).

యూటా రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, లేటన్ అనే ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ ఉంది. రైలు రాబోతుండటంతో పట్టాలకు ఇరు వైపులా ఉన్న గేట్లు మూసుకోవడం ప్రారంభించాయి.


Health: ఇతడు నెల రోజుల్లో 900 గుడ్లు తిన్నాడు! చివరకు ఏమైందంటే..

అయితే, ఓ ఎస్‌యూవీ కారు డ్రైవర్ చివరి నిమిషంలో గేటు దాటే ప్రయత్నం చేశాడు. సులువుగా దాటేయొచ్చని పొరపడ్డాడో లేదా కావాలని చేశాడో తెలీదు కానీ గేట్లు పడుతున్న సమయంలోనే అతడు ముందుకు పోనిచ్చాడు. ఎలాగొలా మొదటి గేటు దాటాడు కానీ రెండు గేటు మాత్రం అప్పటికే మూసుకుపోయింది. దీంతో ముందుకెళ్లే దారి లేకపోవడంతో కంగారు పడ్డ డ్రైవర్ కారును వెనక్కు తీసుకున్నాడు. ఆలోపే వెనకున్న గేటు కూడా మూసుకుపోవడంతో కారు పట్టాల పైనే ఆగిపోయింది. కారుతో గేటు విరగగొట్టి వెళదామనుకున్నాడు కానీ అదీ సాధ్యపడలేదు. ఈలోపు రైలు దగ్గరకు వచ్చేసింది. దీంతో, చివరి క్షణాల్లో అతడు కారు దిగి పారిపోయాడు. ఆ తరువాత రైలు వచ్చి ఎస్‌యూవీని వేగంగా ఢీకొట్టడంతో అది తునాతునకలైపోయింది.


Viral: గుర్రంపైకి ఎక్కిన పెళ్లి కొడుకు.. ఇంతలో ఊహించని ఘటన!

ఈ ఉదంతంపై స్థానిక అధికారులు స్పందించారు. ఘటనలో ఎవరూ గాయపడకపోవడం నిజంగా అదృష్టమేనని అన్నారు. వీడియో చూశాక డ్రైవర్ పై అనేక సందేహాలు రావొచ్చు కానీ ఆ సమయంలో టెన్షన్ కారణంగా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందని సదరు అధికారి వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో రైలుకు దాదాపు లక్ష డాలర్ల మేర నష్టం జరిగిందని తెలుస్తోంది.

ఇక వీడియోపై నెట్టింట రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొందరు డ్రైవర్‌ది తప్పు అని అంటే మరికొందరు అతడు పొరపాటు పడి ఉంటాడని అన్నారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద అప్రమత్తగా ఉండాలని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో ఉంది.

Read Latest and Viral News

https://x.com/CollinRugg/status/1889749057893278117

Updated Date - Feb 14 , 2025 | 08:49 PM