Share News

Zoo Viral Video: పెద్దపులుల బోనులో పడిబోయిన బాలుడు.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:15 PM

తాజాగా ఓ బాలుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి "జూ"కు వెళ్తాడు. అక్కడ పెద్దపులుల సమూహాన్ని జూకి వెళ్లిన వారంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.

Zoo Viral Video: పెద్దపులుల బోనులో పడిబోయిన బాలుడు.. చివరికి ఏమైందంటే..
Zoo Viral Video

ఇంటర్నెట్ డెస్క్: పులులు, సింహాలు ఎంత భయంకరమైన జంతువులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటిని సినిమాలు, జూల్లో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది నేరుగా వచ్చి మన ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. తలచుకుంటేనే భయమేస్తోంది కదా.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అది కూడా ఏడేళ్ల బాలుడికి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.


తాజాగా ఓ బాలుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి "జూ"కు వెళ్తాడు. అక్కడ పెద్దపులుల సమూహాన్ని జూకి వెళ్లిన వారంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. సదరు చిన్నారి సైతం రీలింగ్‌పై కూర్చొని అందరితోపాటు చూస్తుంటాడు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా పులుల ఉన్న ప్రదేశంలో పడిపోతాడు బాలుడు. దీంతో తల్లితోపాటు అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతారు. దాదాపు నాలుగైదు పులులు బాలుడి చుట్టూ చేరుతాయి.


అక్కడున్న వారంతా పెద్దపెద్ద కేకలు వేస్తూ చిన్నారిని ఏం చేయకుండా వాటిని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అయినా అవన్నీఅతను చుట్టూ చేరి గంభీరంగా గాండ్రిస్తుంచే చిన్నారి మాత్రం ఏడుస్తూ కూర్చుంటాడు. అనంతరం పెద్దపులి పిల్లతో సదరు బాలుడు ఆడుకుంటూ బయటకు వెళ్లేందుకు మెయిన్ గేటు వైపునకు నడుచుకుంటూ వెళ్లిపోతాడు. చివరికి బయటకు వచ్చి తల్లితో కలిసి చిన్నపులికి బాయ్ చెప్తాడు. ఇదేంటి.. ఇలా ఏలా జరుగుతుందని అనుకుంటున్నారా?. అక్కడే ఉంది మరి ట్విస్ట్. ఆ వీడియో ఏఐ రూపొందించింది.


ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో పిల్లలకు వేసవి సెలవులు వస్తాయి. దీంతో అంతా కలిసి వాటర్ ఫాల్స్, జూ పార్కులు వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా అజాగ్రత్తగా ఉంటూ చిన్నారులను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకునేందుకు రూపొందించిన వీడియో అది. ముఖ్యంగా జూ పార్కుల్లో క్రూరమృగాలు ఉంటాయి కాబట్టి అక్కడ మరింత అప్రమత్తం అవసరం. అయితే తొలుత ఈ వీడియో చూసిన వారంతా చిన్నారి ఉన్న పరిస్థితి చూసి అయ్యో పాపం అనుకుంటారు. చివరికి విషయం తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Toothbrush: టూత్ బ్రష్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోకపోతే అంతే సంగతులు..

Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..

Updated Date - Apr 04 , 2025 | 10:17 PM